పుట:ఉత్తరహరివంశము.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

205


ఆ.

కలనఁ బడినవారిఁ గయికొని [1]కొనిపోయి
పుండ్ల నోమి మగుడఁ బుచ్చు టొప్పు
బంత మడిగి మగుడ బవర మిచ్చుట యొప్పు
నించునేని దాన యేలు టొప్పు.

266


వ.

వినుము చెప్పెద.

267


క.

భుజగర్వ మడఁగఁ జుట్టిన
భుజగాస్త్రము లిట్టు నట్టుఁ బొరలం బడినన్
గజిబిజి లేదు మొగంబున
మజ బాపురె వీనిఁ బోల మగలుం గలరే.

268


గీ.

వేయిచేతులవాఁడవు వివిధసమర
విజయశాలివి దైతేయవీరవరుఁడ
విట్టి నీతోడఁ బోరాడ నెవ్వఁ డోపు
విక్రమక్రీడ సరి లేని వీఁడ కాక.

269


చ.

ఇతనికులంబుఁ బేరు విని యేలఁ దలంచిన నేలు మేలు నీ
కతిబలుఁ డయినబంటు హృదయంబున రోషము పట్టితేని వ
ధ్యతకు విధింప నేల యితఁ డాఁకకుఁ బాత్రము నీ వెఱుంగవే
ప్రతినయు నాజ్ఞయుం దగవుఁ బంతము రాజులు దప్ప రెన్నడున్.

270


మ.

అనినం బండులు గీటి కొంచు హృదయం బల్లాడ బాణాసురుం
డనఘా, నీపలు కేను దాఁటుదునె వీఁ డన్యాయకార్యంబు చే
సిన సైరింపక యుంటి వంశమునకుం జేటైన యీకౌలటే
రునిఁ గన్యాకులటాసమేతముగఁ జేర్తుంగాక కారాస్థితిన్.

271

బాణాసురుఁ డనిరుద్ధునిఁ జెరసాలం బెట్టించుట

గీ.

అనుచుఁ జెఱసాలవారికి నప్పగించి
యాదవకుమారుఁ గూతును నసురవిభుఁడు

  1. పోట్లపుం, డ్లోమి మచుడఁ బుచ్చుటొప్పుఁ బంత, మడుగ మరల బవర వచ్చుట యెప్పుఁగ, గించు