పుట:ఉత్తరహరివంశము.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

ఉత్తరహరివంశము


క.

ఆయుధము దాఁకు డెఱుఁగఁడు
పాయము బలియించి తింతవడి మరల నితం
డాయతభుజుండు మ్రింగును
మాయాబలమునన కాని మడియఁడు నీచేన్.

257


వ.

అనుటయు నతండు రోషదహనదందహ్యమానమానసుండై యొం డుపా
యంబు చేయ నేరక మాయ గైకొనం దలంచి.

258


క.

ఉరగము నెరగొను గరుడని
వెరవున [1]నరు నణఁతు నని దివికి వెస దాఁటెన్
నరథంబుగ సధ్వజముగ
సరథ్యసాహస్రముగ ససారథికముగన్.

259


వ.

ఇవ్విధంబున.

260


క.

ధీరుఁడు బాణుఁ డదృశ్యా
కారుం డయిపోయి కలను గయికొని ఖడ్గ
స్ఫారప్రచారపరుఁ డగు
నారాయణపౌత్రు నేసె నాగాస్త్రములన్.

261


వ.

అయ్యస్త్రంబులచేత.

262


క.

సందానదందశూకా
స్పందితసర్వాంగుఁ డయిన ప్రద్యుమ్యసుతుం
జందనగంధులు చూచిరి
చందనధరణిరుహంబుచందాన ననిన్.

263


వ.

ఇట్లు పాముల చేతం గట్టువడి నేల కొఱిగిన కుమారుం జేరి యరదంబుమీఁదన
టెక్కెంబుకామపై నొఱగి బాణుండుఁ గుంభాండున కిట్లనియె.

264


క.

కులకన్యాదూషకులం
దల గోయక యున్న నేల తగ వగు వీనిం
బొలికలనికి బలి యిమ్మని
పలికినఁ గుంభాండుఁ డసురపతి కిట్లనియెన్.

265
  1. నపు డతఁడు గగనవీథికి దాఁటెన్