పుట:ఉత్తరహరివంశము.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

ఉత్తరహరివంశము


సీ.

లలితనూతనలతాలంకారముల మెచ్చి
                 మొగమిచ్చు లేమావిమోక వోలెఁ
బరివారకాపటలంబుతో నవ్వ
                 దొరకొన్న పిన్నచందురుఁడు వోలె
గమలినీకలికావికాసంబు లెఱిఁగి పై
                 [1]వ్రాలెడు తేఁటిరాచూలి వోలెఁ
సరళసౌదామినీసల్లాపముల మేను
                 గరుపాఱుమిండమేఘంబు వోలె


తే.

నంతకంతకుఁ జిట్టంటు లంటి యంటి
చెలువలకు యౌవనము విందు చేయ నున్న
మాసగుణబద్ధు మన్మథమంత్రసిద్ధు
రుచిరరసవిద్ధు నాయనిరుద్ధుఁ జూచి.

186


క.

మును విద్యాధరసంతతి
యనఁగా వివిధంబు లగునుపాయంబుల మీ
ఱినతనమాయాబలమున
ననిరుద్ధుం బొదివె విస్మయాపాదిని యై.

187

చిత్రరేఖ యుషాంతఃపురంబున కనిరుద్ధుం దెచ్చుట

చ.

పొదివిన నభోవిహారమునఁ బువ్వునుఁ బోలె నలంగకుండ న
మ్మదనసమానుఁ బట్టికొని మానవదానవదేవకోటికిం
గద లెఱుఁగంగనీక చని కాంచె నుషాసతిఁ జిత్రరేఖ యా
ముదితకు రాకపోక [2]లొకమూఁడుముహూర్తము లయ్యె [3]నయ్యెడన్.

188


క.

ఇది నీకోరినఫల మని
సుదతికి ననిరుద్ధుఁ జెలువ చూపి యిటు లనున్
మది సొచ్చి నీకుఁ గూరిమి
యదికిన వలరాచచుట్ట మవునో కాదో.

189


చ.

అనుటయుఁ బూర్ణచంద్రముఖు నాదటఁ జూడఁ జకోరనేత్రకుం
గనుఁగొన నెమ్మనంబు శశికాంతశిలాతల మయ్యె నంతలో

  1. జూఱాడు, జూటాడుట
  2. యెడ
  3. జూడఁగన్