పుట:ఉత్తరహరివంశము.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

ఉత్తరహరివంశము


గులగమిఁ జిక్కెనో యనఁ దగుం దలఁపంగ దరంగమాలికల్
మెలఁతల యంగసంగతుల మీఁదికి మీఁదికి నాసచేయుచున్.

63


సీ.

అరుణారవిందంబు లని మ్రొక్కెనో కాని
                 చిగురుటాకుల నింత సేర రావు
పులినంబు లని చాల బుజ్జగించెనో కానీ
                 మరుచక్రముల నింత మరిగి రావు
చక్రవాకము లని సవరించెనో కాని
                 కరికుంభముల నింత గదియ రావు
గండుమీ లని చాల గారవించెనొ కాని
                 పూవుఁదూపుల నింత వొంది రావు


తే.

తరఁగ లాత్మీయధనముల చాయ లయిన
చరణములు నితంబములును జన్నుఁగవలుఁ
గన్నుఁగవలుఁ దోతేర శృంగారజలధి
తరఁగ లింతులు పైకొన్నఁ దలఁకినట్లు.

64


చ.

అలఁతితరంగలుం దఱులు నంబురుహంబు మొగంబు షట్పదం
బులు నలకంబులున్ సుడియుఁ బొక్కిలి నెక్కుఁడు వేడ్క సేయఁగా
నెలతుఁక సంగడిం [1]గమలి నింగిని జుట్టెడు మిన్నునీరిపైఁ
గొలిచి భవాని చేర్చెఁ జనుగుబ్బలజోడుగ జోడుజక్కవల్.

65


చ.

కరఁగినపూఁతఁఁ గనకకందుకకాంతి వెలుంగుచన్నులం
[2]బిరిగొను దొడ్డముత్తియపుఁబేరులు వాయఁగ మన్మథాంకముల్
దరుణుల నంబికావిభుఁడు దార్కొనుచోఁ గనుచాటు మాటుగా
దరఁగలు చల్లుశీకరవితానము మానము గావకుండునే.

66


చ.

తరళతరంగమాలికల తాఁకున కొగ్గికొనంగఁ గామినీ
కరములు దాఁకి శీకరనికాయము దత్కుచకుంభరాజిపై
బరఁగినఁ దోఁచె భావభవుఁ బట్టము గట్టునెడం బ్రవాళభా
సురముఖపూర్ణకుంభశుభసూనకనిర్మలమౌక్తికాక్షతల్.

67
  1. కమలినిం గని చుట్టెడు నీరు మిన్నుపై
  2. బెరిఁగిన