పుట:ఉత్తరహరివంశము.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

177


క.

కరసరసిరుహంబున నౌక
సరసిరుహం బమర వదనసరసీరుహమున్
బరిమళవశమున మోపుచు
ధరణీధరతనయ దొంతితామరఁ జూపెన్.

68


ఉ.

చెందొవరేకు ఫాలమునఁ జేర్చి ప్రపుల్లపయోరుహంబుచే
నందముగా బిసావళి భుజాంతరముం గదియించి యుత్పలా
మందమరీచిమేచకచమత్కృతిచారుగళోపచారయై
సుందరి యోర్తు వచ్చి హరుచూపులకున్ హరుఁ డయ్యె నయెయేడన్.

69


వ.

మఱియును గొందఱు దెఱవలు పలుదెఱంగులం గఱకంఠుకైవడి విడంబించునెడ
మృడాని ముఖవికాసంబునకు విలాసం బొసంగ నెసంగిన యాసపాటుచే
నాసన్నసమాసీనయై బాణాసురకన్య యగునుషాకాంత యిట్లని వితర్కించు.

70


సీ.

సల్లాపనవసుధాసారంబు చెవిఁగ్రోల్పఁ
                 జెలికత్తెఁ బుచ్చి మెచ్చించువారు
నానందమకరంద [1]మందంద పైఁ జిందఁ
                 గరకంటిచూపులఁ గప్పువారు
ఘర్మాంబుబిందుముక్తా[2]విభూషణము లు
                 ప్పతిలంగఁ జేసేతఁ బట్టువారు
మఱుపుమున్నీటిలో [3]మానంబు లూటాడ
                 బిగియారుకౌఁగిట బెరయువారుఁ


తే.

బొలయలుకఁ బాసి తెలచినఁ బొందువారుఁ
జతురతరవిహారంబులు సలుపువారుఁ
బ్రథమజన్మంబునం దెంత భాగ్యవతులొ
మగలు మన్నింపఁ బెంపారుమానవతులు.

71


వ.

అని విచారించి చెలికత్తెలతోఁ దనతలంపు వెడల నాడుటయును.

72
  1. మడది పైఁ జిమ్మంగ
  2. భూషణము లుప్పతిల్లంగఁ జేసేత జల్లువారు
  3. మానసంబులు దేల