పుట:ఉత్తరహరివంశము.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

ఉత్తరహరివంశము


మ.

సహకారాధిపుఁ గౌగిలించుకొని వాసంతీలతాకాంత సా
రహరిద్రావసగౌరకేసరములన్ రంజిల్లు మాధ్వీకవా
ర్లహరీస్వేదము చూపఁ బట్టపగ లేలా [1]యింతటన్ సిగ్గులే
దహహా యంచుఁ దొలంగి నవ్వెఁ జెలిమాటై ముద్దరా లయ్యెడన్.

50


మ.

ఒకరామాతిలకంబు రత్నరుచితో నొప్పారు మందారకో
రకముం గర్జవతంసత న్నిలుపుచున్ రాగాలతాసక్త చూ
చుకచేలాంచలయై మలంగి విడుమంచుఁ గేలు [2]సాఁచెన్ ససా
యక మౌర్వి న్దెగగొన్న మన్మథుని ప్రత్యాలీఢపాదంబు [3]నాన్.

51


చ.

ఒకచపలాక్షి లేఁజిగురుటూయెలఁ గోయిలరాచవారి ని
క్కకు నెలయింప వచ్చుకలకంటికటాక్షము [4]ఱెక్కతారు స్రు
క్కక పలుమాఱుఁ జూపఁ జెలికత్తెలు [5]ముద్దనబావ పొమ్మనన్
మొకము సగంబు వాంచె మణిముద్రికలం జిఱునవ్వు గప్పుచున్.

52


చ.

లలన లకావితానముల లత్తుకరేకులచాయ చల్లుచే
తుల [6]సెలగొమ్ము లందికొనఁ దోరపునవ్వులు పిక్కటిల్ల నె
చ్చెలులు చెలంగి మావిరులు చెందొవలయ్యె ననం దడంబడం
దలిరులు గోయు రాచిలుకధాఁటులఁ దేఁటులు నాస చేయఁగన్.

53


సీ.

సుడిగొన్నచిగురాకు జొంపంబు గెంపారు
                 తలమీఁద మల్లికాదామ మడఁచి
నిడుదతామరతూఁడు నెట్టెంబు సుట్టి పైఁ
                 బటికంపుఁగడియంపుభాగ మదిమి
తోన యాక్రేవఁ చెందొవఱేకు హత్తించి
                 మెడచక్కిఁ గస్తూరి [7]మెదిచి పూసి
పాయ గొమ్ముల నల్లఁబట్టు దగిల్చి య
                 క్కొనయాకుపై వెండికోర వెట్టి


తే.

ధవళకేతకిధూళిగాత్రమున [8]జెరివి
మోకమామిడి కొకకాంత మ్రొక్కి నిలిచి

  1. యింతలో
  2. సారించెసా
  3. లన్; గాన్
  4. ఱెక్కదారి
  5. ముద్దులసాప
  6. సెలగొమ్మ
  7. మేది
  8. జఱచి