పుట:ఉత్తరహరివంశము.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

173


తమచేసినసుకృతంబులు
తముఁ గాచును రెండు నేల దైవంబునకున్.

44


గీ.

అనుచుఁ గుంభాండుఁ డరిగె బాణానురుండు
దనుజసుందరీసహితుఁడై మనసులూనఁ
గెరలియాడుచు మధుపానకేళిఁ దేలి
యాహవముఁ గోరుచుండె నయ్యవసరమున.

45

ఇందుధరోపాఖ్యానము

మ.

ఒకనాఁ డిందుధరుఁడుఁ బార్వతియు లీలోద్యానకేళీసరి
న్నికటానేకవిహారదేశముల దైతేయేంద్రకన్యాప్సరో
నికురుంబంబులు పారిజాతకుసుమానీకంబు పైఁ జల్ల ద
ర్పకబాణంబుల కెల్లనెల్ల యగు సౌభాగ్యంబుతో నాడఁగన్.

46


వ.

అట్టియెడ.

47


సీ.

కిసలయంబులతోడఁ గేంగేలు దడఁ బెట్టి
                 వీరులపై నఖకాంతి [1]విజ్ఞరాల్చి
లేఁదీఁగలకు దనూలీలఁ గానుక యిచ్చి
                 గుత్తులుఁ బాలిండ్లు గొలిచి చూచి
చలిగాలి నిశ్వాససౌరభంబుల నాఁగి
                 యళిపఙ్క్తిఁ గురులతో నలుక దీర్చి
పుప్పొళ్ళు [2]సెలగందములు వియ్య మందించి
                 పూఁదేనెఁ జెమటల బుజ్జగించి


తే.

తొడలు ననఁటికంబంబులు మెడలుఁ బోఁక
బోదెలు నెలుంగులును బరవుష్టరుతులు
మాటలును గీరభాషలు మక్కళించి
చిగురుఁబోఁడులు వనకేళి చేయఁ జేయ.

48


వ.

వారిలో నొక్కరు.

49
  1. విజ్ఞు
  2. నొసలిగంబురు