పుట:ఉత్తరహరివంశము.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

167


ముద్దాడునెడ సూచి మోదంబు ఖేదంబు
                 బొడమ నెమ్మనములోఁ గొడుకు నిట్లు
పాటింపఁడేఁ దండ్రి పని యేమి కటకటా
                 నా తండ్రి యుండిన నన్ను నిట్లు
పాటించు నిటమీఁదఁ బరమేశ్వరుఁడు తండ్రి
                 గాకున్న జన్మంబు కసటు వోదు


తే.

[1]తపము మెచ్చ కద్దేవుండు తండ్రి గాఁడు
గాన మెచ్చింతుఁ దపముచేఁ గానలోన
నతనిఁ బంచేంద్రియంబుల కప్పగింతు
మానసంబున [2]కట తెత్తు మదనహరుని.

6


మ.

అని బాణాసురుఁ డీసు రోసము మమత్వాహంకృతు ల్మానసం
బునకున్ దవ్వులవైచి నిశ్చలగతిన్ ముగ్ధేందుచూడామణిన్
మునిసంఘాతశిరోభినీతచరణాంభోజాతసంభూతనూ
తనరాగద్యుతిభాసురుం బురహరుం దత్త్వస్థితిం జూచుచున్.

7


వ.

ఇట్లని స్తుతించుచు.

8

బాణాసురుఁడు శివుని సేవించి వరములఁ బడయుట

ఉ.

కొలువఁగ నేర నిన్ను శతకోటివిభాకరతేజు డగ్గఱం
బిలువఁగ నేర నిన్ను మునిబృందవివేకవిమర్శదూరునిన్
విలువఁగ నేర నిన్నుఁ బృథివీవియదంతరభిన్ను నేమిటన్
నిలుపఁ గదయ్య నా హృదయనీరజకర్ణికపై మహేశ్వరా!

9


చ.

[3]కలఁగనినారు నిన్ను మదిఁ గౌఁగిటనెత్తుడువారు ముక్తికిం
దొలఁగనివారుగాఁ దెలియుదుం దలపోయుదు లోన నాసలున్
నలఁగవు హృత్పయోజసదనంబునకు న్నినుఁ దెచ్చునంతకున్
మలఁగఁగదే త్రికోణమణిమంటపదీపికపై మహేశ్వరా?

10


చ.

ఒరసిరి నిన్నుఁ దర్కనికషోపలధా[4]రల వన్నెఁ గాన రె
త్తరసిరి విశ్వముం గపిల యైనను నీదెస ముల్లు సూపఁగా

  1. తగవు
  2. కడఁ జేర్తు
  3. ఇది కం వీ ప్రతిలో లేదు.
  4. రులు