పుట:ఉత్తరహరివంశము.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

163


సీ.

పసిగ్రేపుఁ బెనుచునే? పాఁడి మొల్లం బెట్లు
                 మెకము దాఁటదు గదా? మేపు గలదె?
తొడకాలితఱుపుల విడుతురా తొడితొడి?
                 జన్నెలఁ దరిపట్టు జూడ గలదె?
వెలికల్ల వైతురా వేల్పుల కుడుపుచోఁ
                 గదుపులో నే[1]పోతు గడవఁ బాఱు?
[2]సలగ[3]పన్నులు గొన్ని జట్టిచూపరు గదా?
                 బెదరిన నిలుగూఁతఁ బెట్టఁ గలదె?


తే.

వల్లె వై చువా రెవ్వరు మల్లరాల
లంపు గలతొఱ్ఱులను గూయ లావు గలదె?
యేర్పుదాఁటులలో దొఱఁ గెఱుఁగ బడునె
[4]పరికరము కోడె లమ్మెడుపాటి గలదె?

308


వ.

అనుటయు నతండు.

309


క.

నినుఁ గన్నులార నెప్పుడుఁ
గనుగొనఁగా లేనివగపు గల దొక్కటియున్
వనజోదర! నీయాదర
మునఁ దక్కినపనుల మాకు మోదము గొఱుఁతే.

310


వ.

అనుటయు నచ్యుతుండు యశోదం జూచి యిట్లనియె.

311


శా.

తల్లీ నిన్నుఁ గనుంగొనం బడయుటన్ ధన్యుండనైతిన్ జగం
బెల్ల న్నిన్ను నుతించి మ్రొక్కిన ధనాధీశోన్నతిన్ నిత్యమై
చెల్లు న్నాకుం బ్రియంబు చేయునదియై చెన్నొందు నావారు ని
న్నుల్లంబారఁ దలంచువారు పరమాయుఃప్రాప్తారోగ్యులున్.

312


వ.

అనుచు నయ్యరువురకు యథోచితోపచారంబు లాచరించి నిజనివాసంబులకు
వీడ్కొల్పి యనంతరంబ మురాంతకుండు పుష్కరసరోవరంబునకు వచ్చి యందలి
మునీంద్రులం గాంచి వారిచేత నర్ఘ్యపాద్యంబులు మొదలగు నుపచారంబులం బరితో
షంబు నొందినపిదప వా రిట్లనిరి.

313
  1. తొఱ్ఱు
  2. సలిగ, సలిగె.
  3. పన్నులఁ
  4. పదుదరము