పుట:ఉత్తరహరివంశము.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

ఉత్తరహరివంశము


వికుచితంబు సవ్యజానువు వామజానువు చిత్రకం బాహితకంబు క్షిప్తంబు
గుడుంబంబు లంబనంబు దృతంబు సవ్యబాహువు వినిర్భాహువు సవ్యేతరంబు
వృత్తంబు త్రిబాహువు తుంగబాహువు నవ్యోన్నతంబు దాసి పృష్ఠతః
ప్రసారణంబు యోధికంబు పృఢితంబు నన ముప్పదిరెండు ప్రచారంబులం
బరిభ్రమించి నవసేవకులునుం బోలెఁ జౌరువ వేచికొని ప్రతిగ్రహీతలుం
బోలె ధార యేమఱక జూదరులునుంబోలె నండ మఱవక జౌతిషికులుం
బోలె ముష్టి వదలక గొండ్లి వరిఢవించు నటువులునుం బోలెఁ [1]జాళెలు
చూపి [2]యెగ్గు లాడెడువారునుంబోలె నాసపా[3]టున నిక్కి తూర్పెత్తువారునుం
బోలె విసరి త్రాసునం దూఁచువారునుం బోలెఁ దట్టి దారకులునుంబోలె
నట్టించి పనిఁ దిరుగు వెరవరులునుంబోలె మసలక వడి వసంతమాడెడివారునుం
బోలె జిమ్మి శకటవ్యవహారులుంబోలె మెట్టుకొని విరక్తవిటులునుం
బోలెఁ జేయీక తనిసిన [4]గవరలునుంబోలె సరకు గొనక నటమటపుఁ గోమ
టులునుంబోలె లెక్క సేయక పాదరసమర్దకులునుంబోలెఁ జంపం దలంప
యడిదంబులు జళిపించిన ఝణఝణఝంకారంబులుం దదీయపరస్పరఘర్షణ
కేంకారంబులుం దమహంకారంబులును ముప్పిరిగొనం గొప్పరించియుం
గొసరియు విచ్చియుం జొచ్చియు నదలించియుం గదలించియుం బోరు నవ
సరంబున సురవిద్యాధరగంధర్వదివ్యమునులు దివమ్మున నిలిచి యవ్వీరద్వ
యంబుం గనుంగొని వెక్కసంబున.

256


చ.

ఇతని కితండె సాటి యగు నీతని కితఁడే సాటి వచ్చు ను
ద్ధతిఁ జను వెంట వింట నడిదంబున నింతటివారు లే రుమా
పతికొకరుండు శిష్యుఁ డురుబాహుఁడు ద్రోణున కొక్కరుండు ధీ
రతముఁడు శిష్యుఁ డిట్లిరువురన్ రణధీరతఁ జెప్ప నేఁటికిన్.

257


గీ.

అర్జునుండు మురారి సాత్యకియు వీరు
ముగురు జయకాంక్షు లనిమొన మోసపోరు
శక్తిధర చైద్య డిభకులు సములు వీరు
ముగ్గురు మహారథులు శౌర్యమూలధనులు.

258


వ.

అనుచుం గొనియాడుచుండి రాసమయంబున.

259
  1. జూళ్యాలు
  2. సోగు
  3. టుం దక్కి
  4. తఱువరులునుం