పుట:ఉత్తరహరివంశము.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

153


నారసంబుల వాని నడుమన తునుమాడి
                 శైనేయుఁ డార్చినఁ జాల నలిగి
విశిఖసప్తక మేసి వెండియు లక్ష బా
                 ణంబులు వఱపిన నఱకి వైచె


తే.

వృష్ణివీరుఁడు డిభకునివిల్లు దునిమె
నర్ధచంద్రబాణంబున నతఁడు వేఱ
వింట నిశితక్షురప్రంబు వెలయఁ దొడిగి
శినివరునినోర నెత్తురు చింద నేసె.

250


క.

ఆమని ములు[1]మోదుగుతో
సోమించి మురాంతకానుజుఁడు నెత్తురువ
ఱ్ఱై మరియు నఱకె డిభకుని
చేముందఱ మెఱయువిల్లు శితభల్లమునన్.

251


చ.

డిభకుఁడు వేఱ వింటఁ బ్రకటించిన బాణపరంపరన్ ధరా
విభులు గనుంగొనంగ యదువీరుఁడు గాసిలి వాని చాపమున్
రభస మలర్పఁగాఁ బటుతరంబున ద్రుంచి క్రమంబుతోడఁ ద
త్ప్రభ చెడఁ ద్రుంచెఁ జాపములు పంచశతంబు శతంబు నేకమున్.

252


క.

ఎత్తెడు వేగము విండులు
దత్తఱమున విఱుగ నేయుతమకము నైనన్
జిత్తములు గృపాణరణా
యత్తములుగ నిలకు నుఱికి రావీరవరుల్.

253


వ.

అట్లు ఖడ్గహస్తులై కదిసినప్పుడు.

254


ఆ.

సౌమదత్తి నకుల సౌభద్ర దౌశ్శాస
ని ప్రసిద్ధఖడ్గనిపుణవిద్య
డిభక సాత్యకుల కడిందిశౌర్యము నందుఁ
గానవచ్చె నట్లు గదిసి వారు.

256


వ.

భ్రాంతంబు [2]విభ్రాంతంబు విద్ధం బావిద్ధంబు విప్లుతంబు విసృతం
బాకరంబు వికరంబు భిన్నంబు నిర్మర్యాదం బమానుషంబు సంకుచితంబు

  1. మోఁదుగుతో
  2. బుధ్భ్రాంతంబు