పుట:ఉత్తరహరివంశము.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

145


రావంబుచేత సకల
స్థావరములుఁ గదలఁ బాంచజన్యం బొత్తెన్.

215


సీ.

వడఁకుపన్నగరాజుపడగలమీఁద స
                 ర్వంసహాకాంత పేరణము సూప
నుఱ్ఱూత లూఁగెడు నుదయాస్తగిరులతో
                 నాకాశలక్ష్మి కోలాట మాడఁ
దెర లెత్తి సప్తసాగరములుఁ బొరలంగ
                 వరుణుండు గొండిలి పరిఢవింప
మొకములచాయ వేఱొకచండముగ నిల్చి
                 కమలసంభవుఁడు [1]ప్రేంఖణ మొనర్చ


తే.

మంగళములోని ప్రేలాలమాడ్కిఁ జుక్క
లిక్కడక్కడ పడ దిక్కు లెనిమిదియును
బగులఁ బాతాళతలము [2]గుబ్బటిలఁ జెలఁగె
శౌరి పూరింప నప్పాంచజన్యరవము.

216


మ.

రథవేదండతురంగసైనికగణారావం బుదాత్తశ్రుతి
వ్యథనిస్సాణధణంధణంధణధణధ్వానంబుతో దిగ్వియ
త్పృథివీమండలమెల్ల నిండుటయుఁ దద్ధీరధ్వనిం బైకొనెం
బ్రథనారంభవిజృంభమాణహరిశార్ఙ్ఘక్వాణ[3]నిక్వాణముల్.

217


వ.

ఇట్లు చతురంగసైన్యసమేతంబుగా సవరణతో సన్నాహంబు మెఱసి హృషీ
కేశుండు పుష్కరసరస్తీరంబున విడిచి తదీయజలంబుల నుపస్పర్శంబు చేసి మొన
లేర్పఱిచి యున్న యవసరంబున.

218

హంసడిభకులు యుద్ధసన్నద్ధు లయి వచ్చుట

మ.

భసితాలిప్తవపుస్త్రిపుండ్రనిటలప్రత్యగ్రరుద్రాక్షదా
మసముజ్జృంభితవేషు లై వరధనుర్మాహేశ్వరాద్యస్త్రశ
స్రసమృద్ధిన్ రథముల్ వెలుంగ మును భూతద్వంద్వ మేతేర రా
జసహస్రంబులతోడ హంసడిభకుల్ సంగ్రామసన్నద్ధులై.

219
  1. పెక్కణ
  2. గుబ్బతులు వోవ
  3. నిర్మాణముల్