పుట:ఉత్తరహరివంశము.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

ఉత్తరహరివంశము


సీ.

[1]ఉద్ధతి నిజదశాక్షౌహిణీబలముతోఁ
                 బడగలు గ్రాలంగ వెడలునప్పు
డవసరం బెఱిఁగి దానవు లనేకసహస్ర
                 సంఖ్య లేతేర విచక్రుఁ డనఁగ
దైత్యేంద్రుఁ డటమున్న తత్కుమారద్వయ
                 సఖుఁ డైనవాఁడు వాసవునితోడఁ
గెలిపించెఁ బూర్వగీర్వాణుల
                 నారాయణునితోడి బోరిపోరి


తే.

ద్వారవతియందు నొంచె యాదవులనెల్ల
నట్టి వీరుండు దోడు రా యాతుధాన
ముఖ్యుఁ డగునాహిడింబుండు మొనకు నడిచె
దైత్యులెల్లను జెదర యాదవులు సెలఁగ.

220


వ.

ఇవ్విధంబున.

221


క.

ఎనుఁబది యెనిమిది [2]లక్షల
దనుజులు రాక్షసులు నడవఁ దమసైన్యంబుల్
మొన లై పదియక్షౌహిణు
లనూనగతి నడవ నడచి రానృపతనయుల్.

222


సీ.

కరటిఘటాకోటికటనిర్గళన్మదా
                 సారంబు దొలుకారుఁ జేరఁ బిలువ
రథనేమిర్భిన్నపృథివీపరాగంబు
                 నీహారసమయంబు నేర్పుఁ దెగడ
సుభటభుజోద్భటక్షురికాప్రభాభంగి
                 మండువేసవితోడ మాటలాడఁ
దురగధట్టఖలీనధుతఫేనతారకా
                 వళి శరత్కాలంబువరుసఁ జూపఁ


తే.

బవనచంచలధ్వజపటపల్లవములు
నవవసంతంబుఁ దెలుప సన్నాహతరళ

  1. సన్నద్ధ
  2. వేవురు