పుట:ఉత్తరహరివంశము.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

141


వీడ్పడి మ్రోయ డాయఁ బదివేవురుజోదులసింహనాదముల్
దోడ్పడ వే రసాతలము [1]దూఱిన మిన్నులమీఁదఁ బాఱినన్.

198


వ.

వా రెవ్వరంటేని వినుము.

199


సీ.

హలపాణి బ్రథముఁ డాహవశాలి సాత్యకి
                 నేను రెండవవాఁడ నిట్టివాఁడ
మొగజోదు కృతవర్మ మూఁడవవాఁడు నా
                 లవవాఁడు నిశరుఁ డుల్లఱపుబిరుదు
కంహు డేనవవాఁడు ఘనవిక్రమాఢ్యుండు
                 వివిధుఁ డాఱవవాఁడు విజయధనుఁడు
వివిధాస్త్రనిపుణుఁ డేడవవాఁడు ప్రఘనుఁ డ
                 ష్టముఁడు సారంగుఁ డుత్సాహశీలి


తే.

నవముఁడు విదూరదుండు సన్నాహమహితుఁ
డుద్దవుండు దళముఁ డింక నున్నవారి
నెన్నఁ గొలఁదిగా ది ట్లౌట యెఱిఁగి కృష్ణు
వెదకి తి[2]ప్పుడు పులిఁగోల వ్రేసినట్టు.

200


క.

హరి తనయు లిరువురును మీ
యిరువురకును ముందుకప్ప మెవ్వని కెవ్వం
డరువఁ గలవాఁడు వెఱ్ఱీ!
సురపతిగతిఁ బాసి రాజసూయము గలదే.

201


వ.

ఇంకం గార్యంబు పరువంబు దప్పె సంగరంబ పరిపక్వం బైనయది
వినుము.

202


క.

దురమునకు న్మధురయుఁ బు
ష్కరముఁ బ్రయాగంబుఁ దగిన కలఁకులు మీ కే
[3]దుర వగు నది గొను మనె హరి
యిర వగుగోవర్ధనంబు నేన యొసఁగితిన్.

203
  1. దూఱియు... బాఱియున్
  2. పరున్నపులిఁ
  3. దొర పగు