పుట:ఉత్తరహరివంశము.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

ఉత్తరహరివంశము


వ.

అనుటయుం గనుంగవం గినుక నిక్క నక్కుమారయుగళంబు గిటగిటాయ
మానదంతంబును జటులభ్రుకుటివికటనిటలంబును నిబిడదీర్ఘతరనిశ్వాసంబును
నిష్పేషణభీషణకరతలంబును నిర్గళితఘర్మజలకణకలుషితకపోలంబును నగుచు
నవుడుగఱచి యిట్లున్నభంగిన పగఱం బరిమార్తు ననుచుండె నప్పుడు హంసుండు
సాత్యకితో నిట్లనియె.

204


ఉ.

ఓరి దురాత్మ! నీకుఁ దెగ నొల్లక యుండుట నీ పరాక్రమం
బారసి కాదురా వెఱవకాడుము దూతుఁ డవధ్యుఁ డెందు నీ
వీరుల నిన్నుఁ జమ్మెటనె వ్రేయుదు డాయుదుఁ బోర శౌరికిన్
సీరికి బాహుసార మెడసేయుదుఁ జేయుదు రాజసూయమున్.

205


మ.

వినురా సాత్యకి! మాట లేమిటికిరా వేదండకోదండకే
తనసంకేతనరేంద్రనూతనబలోదగ్రంబుగా మోహరిం
ప నవశ్యంబును వత్తుఁ బుష్కరసరఃపార్శ్వంబునం దెల్లి గొ
ల్లెన లెత్తింతు విరోధు లంబునిధివెల్లిం [1]డొల్లఁ జల్లింపఁగన్.

206


వ.

అనుటయు డిభకుండు.

207


చ.

విడు విడుమంచు నా మొనలవీరులు పోరులు గోరుచున్న వా
రెడపడకుండ మి మ్మిచట నెన్నితి [2]కొందఱ సిగ్గు గాదటే
గొరగులు దప్పఁ బట్టినను గోటగ నేనిక [3]తెట్టువెట్టినన్
బడుగులు మీరు చూడ హరిపాపటపై నడిదంబు వెట్టుదున్.

208


వ.

అనుటయు సాత్యకి కోపించి.

209


చ.

కడఁగితి [4]దౌత్యము న్నెఱపఁ గాన సహింపకపోదుఁగాక నా
కడిదము చేత నుండఁగ మురారి విరోధులఁ బట్టి పూవునుం
[5]దొడిమయుఁ జూపకున్న నది ద్రోహము పందెము వేసి తుండము
ల్దడఁబడకుండ మిమ్ముఁ బెడధారన వ్రేయుదు నేమి చేయుదున్.

210


వ.

అనుటయుఁ గోపంబులు రూపంబులు గైకొన్న తెఱంగున నాహంసడిభకులు
సాత్యకితో వీ వింక సంగరసన్నాహంబున సకలసైన్యంబుల సమకూర్చుకొని
పుష్కరసరోవరంబునకు రమ్ము చావునకుం దప్పితివి పొమ్మనుటయుం గనలి కల

  1. పుల్లఁ
  2. రున్నఁగ; నీకును
  3. తట్ట
  4. ధౌర్త్య
  5. దొడమయుఁ