పుట:ఉత్తరహరివంశము.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

121


క.

వారివెనుక నంతంతం
జేరి జనార్ధనుఁడు వోయెఁ జెడి రకటకటా!
వీ రనుచు విధివినోదము
వారింపఁగ మనుజకోటి వశమే యనుచున్.

72


వ.

ఇట్లు పోయిన యనంతరంబ.

73


శా.

దుర్వారోద్గమరోషభాషణము లై ధూర్తప్రలాపంబు లం
తర్విద్యామహిమం గలంప యతు లంతం జేర నేతేర నీ
నిర్వేదం బుడిగింప నచ్యుతుఁడ పో నిర్వాహకుం డంచు నా
దుర్వాసోమునిపుంగవుండు గదలెన్ దుఃఖాకులస్వాంతుఁడై.

74


క.

మండఁగ మండగ నార్చిన
ఖండితబిదలములుఁ ద్రుటితకౌపీనములున్
దండముల తుండములును గ
మండలుశకలములుఁ జూచి మఱకువ దోఁపన్.

75


గీ.

మురవిరోధిముందట నిట్టమోపు గట్టి
తేరఁ బంచి సహస్రయతిప్రవరులు
తోడ రా [1]నెండ దాఁకిన నీడచోట
నిలిచి నిలిచి యహోరాత్రనిర్గమమున.

76


వ.

రేపకడ.

77


గీ.

ద్వారకోపశల్యం బటు చేరి యొక్క
కొలన వార్చి దుర్వాసుఁడు గూడ వచ్చు
యతుల ముందట నరుదెంచి యాదవేంద్రుఁ
డాడుచున్న సుధర్మాసభాంతికమున,

78


క.

అఱువుడు గావిముసుంగును
విఱిగినదండంబుఁ దునిసి వ్రేలెడు గోచిం
బఱి[2]య లయినకరకమునయి
చుఱచుఱ జూఁచెడితెఱగుచూపులతోడన్.

79
  1. నేరకంతంత
  2. యలునకమండలమును