పుట:ఉత్తరహరివంశము.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

ఉత్తరహరివంశము


చ్చో నుండన్ సమకూడునే మనకు నంచుం జించె నమ్మౌని కౌ
పీనంబున్ నృపుఁ డాజనార్దనుఁడు దప్పింపంగఁ గ్రౌర్యంబునన్.

65


ఆ.

కలఁగి కన్నవారు కన్నదిక్కునఁ బాఱి
పోయి రెల్లయతులు బోగుమిగులఁ
గినుక యడర సన్నగిల్లినయెలుఁగుతో
నమ్మునీంద్రుఁ డిట్టు లనియె మఱియు.

66


గీ.

చేయఁదగని కీడెల్లఁ జేసితిరి మీరు
చెఱుపనోపుదు శాపంబుచేత మిమ్ము
నయిన యతి నైన నా కేల యాగ్రహంబు
దానవాంతకుఁ డిటమీఁదఁ దాన చెఱుచు.

67


మ.

సకలోద్యోగకృతానుబంధుఁడు జరాసంధుండు బంధుండు మీ
కకలంకుం డతఁ డాశ్రమస్థు[1] లను నౌదాసీన్యముం జేయఁ డూ
రకపాయంగలవాఁడు నేఁడు మిము దుర్వ్యాపారులం జూచి కొం
కక మీకింకిరికిం జెలంగినఁ దొలంగం బాఱుఁ దద్ధర్మముల్.

68


క.

పో పొమ్మని పలుమాఱుం
గోపమ్మున హంసుఁ బలికి కొనియాడుటయుం
జేపట్టుట మెఱయఁ గృపా
నూపాపాంగుఁడు జనార్దనుని దీవించెన్.

69


క.

శ్రీవల్లభుతో సంగతి
గావుత నేఁ డెల్లి నీకుఁ గలుగు సుజనసం
భవితలోకద్వయసుఖ
మీవృత్తాంతంబుఁ జెప్పు మీజనకునకున్.

70


చ.

అనునెడఁ గ్రమ్మఱం గినిసి హంసుఁడు నాడిభకుండుఁ దోడి దు
ర్మనుజులఁ గూడి దండముఁ గమండలముం బిదలంబుఁ జిక్కమున్
మునుకొని వెండియున్ యతులముం పగుసొమ్ములు [2]గాల్చి గాల్చి క్రొ
వ్వునఁ గఱకుట్టు లయ్యెడఁ జవు ల్గొనిపోయిరి వేడ్క నూరికిన్.

71
  1. లకు నీర్ష్యఁన్ దైన్యముం
  2. గాల్చి క్రొవ్వునన్, గనుకుటు లయ్యెడం జవులుగాఁ గొని