పుట:ఉత్తరహరివంశము.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

119


క.

అలవడునే రాజులకుం
దులువతనము వినుము యతులతో నతులమతుల్
గలుషించుట చిత్తము నోఁ
బలుకుట బాంధవులుఁ దారు బ్రదుకుతలంపే.

57


వ.

అనుచుండ నమ్మునీంద్రుండు.

58


క.

కరుణయుఁ గోపముఁ గనుఁగవ
[1]నొరయఁగ నొకచంటఁ బాలు నొకచంటను నె
త్తురుఁ గురియుగతి జనార్దను
ధరణీశసుతద్వయంబుఁ దప్పక చూచెన్.

59


గీ.

చూచి యిట్లను భూపాలసుతులతోడ
నన్నుఁ గనలించి బ్రదుకఁ గన్నారు లేరు
పొలిసితిరి పొలిసితిరి వే పొండు తొలగి
మిమ్ము దరికొనుకోపంబు మ్రింగికొంటి.

60


వ.

అది యె ట్లనిన.

61


ఆ.

చక్రధరుఁడు బారిసమర నున్నాఁడు మి
మ్మింక వేఱె కోప మేల నాకు
తెఱఁగుమాలి తవుడు దిని చచ్చువానికి
విషము వెట్టువాఁడు వెఱ్ఱివాఁడు.

62


క.

అనుచుఁ గదలి పో వచ్చిన
ననుమానము మాని హంసుఁ డమ్మునిఁ జేప
ట్టినచంద మేమి చెప్పుదుఁ
బనికిన కాలోరగంబుఁ బట్టుట దోఁచెన్.

63


వ.

ఇట్లు పట్టుకొని.

64


శా.

తాను న్నిక్కమ పెద్దవాఁడు బలె నీతం డిత్తఱి న్నక్కఁ బ
గ్గానం బట్టినయట్టు బిఱ్ఱబిగియంగా నెంతసే పైన ని

  1. నొరిచంటం బాలు గురియ నొరిచంటకునె