పుట:ఉత్తరహరివంశము.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

ఉత్తరహరివంశము


వ.

ఇట్లన్నునం గన్ను గానక తిరుగు మన్నుఁబోతుల నున్న యునికిన
గన్నంతటం బడ నేసి పోవం బోవ.

27


గీ.

నీర ముంచిన సొరకాయ నెగసినట్లు
పేరుకొని వైచు[1]తెల్లంటుచీర వోలె
[2]నుంకుచెండువిధంబున నుత్తరించు
తములపాకు నిక్కెడుక్రియ దాఁటె నిఱ్ఱి.

28


వ.

ఇవ్విధంబున నెగసిన యిట్టి నాలుగుకాళ్లునుం ద్రెవ్వ నొక్కమ్మున
నేసి చనునెడ మఱియు నప్పటప్పటికిం జొప్పరులవలన నుప్పతిల్లిన చప్పు
ళ్ళకుఁ దెప్పరం బైన తుప్పల దూరు దుప్పులును (నిడువేఁటకార్లు)
(వేటఁకుం) గడంగిన నడికి నడికిడవారికి నెడగాక తొడిగిన యమ్ముననపడి
పొరలు పిడులు విడువక చిడిముడిపడు కడఁతులును నీఁటెలకుం బోటబ్బక
సూటిమెయి దాఁటియు వేఁటచే విటతాటంబైన లేటికదుపులును
బిఱుంద [3]రొప్పుచోఱిగాఱకుఁగాక వెఱచఱచి పఱచు నెడఁదెఱపి నుఱికిన
తొరు ద్రొక్కువం కుక్కలచేఁ బఱిపఱి యైన యఱుములును గొందఱు
గొందఱ ముందటం గొందలం బంది యందంద సందడిం గ్రిందు మీఁదుగా వైచినం
జిందఱవందఱలుగా మ్రందిన కుందేళ్ళును నేదెసఁ దొలంగినను నూదిపిఱింది
త్రాడై [4]యాదిగొని పాదులవారిచే [5]యాదుల కాదులచే మూదలించిన సీద
రంబులతోఁ బాదుకొనిన యేదులును నివ్వలవ్వలనుండి యెడత్రెవ్వకుండఁ
ద్రవ్విన యోదంబులంబడి క్రొవ్వఱక మవ్వంబు నివ్వటిల్లం బట్టుపడిన చివ్వం
గులునుం గలిగినం గనుంగొనుచు వెండియుఁ [6]గ్రీఁగాలి నోలిం జాలుకొలిపిన
కాలువలలకుం బాలువడి లోలోపలం గవళించియు దోడ్తోడ జోడెంపువల
లకు లేటివేడెంబు చేసినం గూడఁబడియును మున్ను పన్నినకన్నెవలల సన్న
సన్నం బోవక యన్నునం గన్ను దిరిగిపడి సన్న సున్నంబుగాఁ దన్నికొని
యును నడ్డగించి నించినయొడ్డువలలకు పట్టించి వెడ్డునం బడక గడ్డుఱికియు
మృగంబు లనేకంబులు వొలియుటయును వేఁట చాలించి హంసడిభకులు
నడపులం దిరిగి పరిశ్రాంతులై సేనాసమేతంబుగా మగుడం దలంచి
మధ్యాహ్నసమయంబున.

29
  1. తెల్లంటి
  2. నుక్కు చెడక వేగంబున నుత్తరించు
  3. చొఱకారకుంగాక
  4. యెయిదికొను
  5. యాదలకాదలచే
  6. క్రిగ్గా