పుట:ఉత్తరహరివంశము.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

115


చ.

కనిరి కుమారు లంత శశికాంతశిలాతలశీతలస్థలీ
వనఘనపాదపాదపనివారితవారితరంగరంగన
ర్తనపరివర్తనద్విరదదానసమదాళిమాలికా
తనువనజాతనూతన[1]పతాకముఁ బుష్కర మన్ తటాకమున్.

30


క.

కని యాపద్మాకరమున
దను పారెడునీరు ద్రావి తమ సేనలుఁ దా
రును విశ్రమించి రాసే
చనకము లగుతరులనీడ సైకతములపై.

31


వ.

అట్లున్నయెడ.

32


క.

మాధ్యందినసవనధ్వని
విధ్యుక్తస్వరముతోడ విని వచ్చుటయున్
స్వాధ్యాయపరులు గావున
సధ్యాహారంబు పుట్టె నయ్యరువురకున్.

33


క.

ఊహించి యాశ్రమం బగు
నోహో యిం తొప్పునే సముచ్చారణ మం
చాహంసడిభకు లేసం
దేహము లే కందు సనుమతి సముత్థితులై.

34


ఉ.

అచ్చట సేనల న్నిలిపి యాశ్రమవాసులఁ జూచువేడుకన్
వచ్చిరి పాదచారు లయి వారు జనార్దనుఁ డేఁగుదేరఁగా
లచ్చి తనూవిలాసమున లావు ధనుశ్శరధారణంబుచే
నచ్చువడంగఁ గాశ్యపమహామునియజ్ఞసమీపభూమికిన్.

35


క.

ఆగి [2]సభాచార్యులకున్
బరిపాటి నమస్కరించి పదపడి వా రా
దరమునఁ జేయుసపర్యలఁ
బరితోషము నొంది కశ్యపప్రభృతులతోన్.

36
  1. బలాకము (వావిళ్ళ); పతాకము (వీ)
  2. యచటిమునివరులకు