పుట:ఉత్తరహరివంశము.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

113


సరస జనార్దనుఁడుం జన
నరిగిరి వేఁటాడ ధరణి యల్లల నాడన్.

21


క.

వెలివాఱును గాలరులును
వలలుఁ దెరలు దీమములును వడిఁ దీరిన కు
క్కలు నారెగోలలును మం
డలక్రోవులు వేఁట కారడంబుఁ బెనుపఁగన్.

22


వ.

ఇట్లు వచ్చునెడ ముందట.

23


సీ.

ప్రబలదంష్ట్రాగ్రపర్యస్తముస్తాస్తంబ
                 జంబాలశబలవేశంతపంక్తి
ఘనఘనాఘననీలఘనవనప్రతిఘాత
                 ఘనఘర్షణావభగ్నద్రుమంబు
ఘురఘురారవఘోరఘోణాప్రఘాణవి
                 ద్రాణచ్ఛదాచ్ఛన్నతాంతలతము
ఖవనఘళాత్కారి ఖరఖురోత్పాతత్రి
                 హల్యధాత్రీధ్వస్తయవసరాజి


తే.

ఖేటభాటభాషణోద్భటాఖేటచటుల
కుటిలకటుకటాక్షేక్షణక్షోభబధిర
మతిరథసభాసమానయానాభిమాన
రౌమవిక్రియాకులము వరాహకులము.

24


వ.

అప్పుడు పందికదుపుల వెనువెంటం దవిలి కొందలింపం జిందఱవందఱగాఁ
జేసి యేసి యట చనఁ జన.

25


గీ.

నల్ల[1]సేనపుగుండులు నడచినట్లు
[2]మంపు గొని మే యెఱుంగక మలసి మలసి
[3]నెనరువారికి నురుకంగ నెగసి మన్నుఁ
బోతు లెడ చొచ్చె దాఁటెడు పొదలువోలె.

26
  1. సీసపు
  2. మ్రంపుకొని మెయ్యె
  3. నెనడువాతికి