పుట:ఉత్తరహరివంశము.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

101


వ.

ఇత్తెఱంగున నత్తరుణి కరకౌశలంబును దట్టనయుం బుచ్చిపెట్టు వెర
వును గెలుపులెక్కయు లోపలఁ గలంగుటయు మోసపోక పంతం బడి
గిన నిమ్మపండు వైచి యుఱికితి నని సరి సరి యన్న జొన్నల కని తాఁకె
నన్నఁ గొన్న వారికి నని గెలిచితి నన్నమగనికి మున్నని పుడికిపుచ్చికొన్నట్లు
గత్తరించిన చందంబునఁ బందెంబు పఱచినవిధంబున మ్రొక్కిన దీవించిన
విధంబున వెరవున నాడుటయు నాకపటనాటకసూత్రధారుం [1]డంకించుకొని
యుల్లసంబున సారెయొడ్డి తొమ్మిది దాయంబుల కిచ్చిన నచ్చెలువ యెక్కి
పరిక తప్పుదాయంబునకు నొక వ్రాయి విడిచెద ననుటయు నద్దేవుండు
నాదాయ మీరైదు వెనుక యోటంబు విఱుగు ననుటయు నుదరిపడి యమ్ము
దిత సవిలాసంబుగా వైచిన నాశౌరి గోరినదాయంబ పడినం బొంగి వెనుక
సరి సరి యని యంతనుండి విన్ననై యాడి యన్నాతి మిగుల నోడియుం
దలంకక.

123


సీ.

చేయదు దుగుణంబు నెలవు లేకుండిన
                 నెక్కినపలకఁ బో నిచ్చుఁగాని
పలుకదు రోషించి పడనిపాసికలతో
                 నవదాయ మైనను నాడుఁ గాని
యొల్లదు గోపించి యొండునెత్తము పన్న
                 [2]నెచరంబు నేర్పని యెన్నుఁ గాని
నడుఁకదు వంచించి నయ మెక్కు డడిగిన
                 నిలుత మంతట నన్న నిలుచుఁ గాని


తే.

పలక దఱుమక [3]బయసుక పల్లటిలక
బోఁటి దూఱక యాతావు పుచ్చు మనక
[4]క్రింద గెలిచినవ్రాలు లెక్కింపు మనక
తప్ప నాడక తొల్లింటిదారి చెడక.

124


క.

ఇవ్విధమున రుక్మిణీమదిఁ
బువ్వుం బరిమళముబోలెఁ బొలుపుగ నెత్తం

  1. డెక్కించుకొని
  2. నచరంబు యురయు
  3. బైసిక
  4. యెంతలెక్కింపుమనక వ్రాయెక్కు డనక