పుట:ఉత్తరహరివంశము.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

ఉత్తరహరివంశము


సీ.

[1]జోగిణి గొసరి [2]బైసుక వెట్టి పలకపై
                 సారెలు వోయించి సరము చూచి
తనకు లా గయిన నెత్తంబు గైకొని పన్ని
                 పాసికర్ దాళించి పా టెఱింగి
లోహటంటులు [3]మానిలులిఁ గన్నఁ బడకున్నఁ
                 బరదాళ మని పోవుఁ బలక లిచ్చి
తప్పారుఁ జూ రెండుదాయంబులును గని
                 వారింపకుము పోటువ్రాలు గలపు


తే.

పంత మడిగిన నీవలె భాగ మింతఁ
బోరఁ బెద్దదాయం బాడి పోరు పుచ్చి
వైచునది ధన మునికి పో వచ్చు ననుచుఁ
బేరుకొని పాటుతఱి సరి బేసి యడిగి.

120


క.

అత్తీవం [4]చిత్తిగ దుగ
సత్తా దచ్చౌక వంచి చౌవం చీరై
డిత్తిగ యిద్దుగ బద్రలు
చిత్తంబునఁ దలఁచినట్లు చేతికిఁ దెచ్చున్.

121


సీ.

దుగుణంబు సేసినతోడనే మూఁ డని
                 వారించి లేదని వలుము సేసి
యూర కెత్తకు దాయ ముగ్గడించినఁ గాని
                 పట్టి వేయకు మని పటితళించి
వెడలిన సారెలు వెనుకముందఱ చేసి
                 యెత్తిన సారె పో నీక యార్చి
సమ మాయె రమ్మని సరస [5]వారలఁ బిల్చి
                 గెలుపు సుమాళంబు గెరలఁ జేయ


తే.

బసిడి యీరైదు పూజించి పలకమీఁద
బలపమున వ్రాసి వెలివ్రాయిఁ దొలగివైచి
పన్ని పంచి యెక్కటి నాడఁ బంచి వ్రాలుఁ
దప్ప నో పత్రనయమునఁ దాన గెలిచె.

122
  1. జేగి
  2. వైసిక
  3. లులితంబువడ
  4. చవుక దుగ
  5. వారికి విచ్చి