పుట:ఉత్తరహరివంశము.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

99


నటమటీనితోడ నడియరితోడను
వెలకు నెత్తమాడ వెరవు గాదు.

112


క.

జూదరివి సుమా[1]ళివి నెఱ
వాదివి [2]తసుకరివి గెలువ వచ్చునటే దా
మోదర నిను మా కనుటయు
నాదెసఁ గనుగొనక పిలువు మనె జాంబవతిన్.

113


వ.

అనుటయు సత్యభామ సాసూయంబుగా వాసుదేవున కిట్లనియె.

114


క.

కలిగె నొక జాంబవతి వె
న్నెలవడఁ [3]బడె దేల వలపు నీతల వేగెన్
బులియ[4]క వే సవతులు గల
పొలఁతుల కేపాటు వడక పోరా దనియెన్.

115


క.

చిత్తం బూరక కలఁచెదు
నెత్తము నాతోడ నాడ నేరుపు గలదే?
పొత్తు గలసి నీవును నీ
తత్తబళలు రండు గెలిచెదం బరువడితోన్.

116


ఉ.

ఇంతయు నేల మీద నెదు రెక్కటి[5]లో మునికిం బదారు సె
ల్లింతుఁ [6]గడళ్ళతాఁకున వెలిం బడ సారె గలప్పు డిత్తు గె
ల్పంతన సంగ్రహంబున సహారువు[7]తోఁ గను మాడిపోయినం
బంతముతో [8]దొహారమునఁ బెట్టుదుఁ బాసికబొమ్మ గట్టుదున్.

117


చ.

తొలితొలి రుక్మిణీరమణితో నెఱవాదిని నెత్తమాడుమా
గెలిచెదవేని మేలు సరికిం దగ నాడెద సూడు వట్టి నీ
కొలఁది యెఱుంగమే యనుడుఁ గోపము గన్నులఁ గ్రోలి నవ్వి య
చ్చెలువలతోడ శౌరి పొలిచెం జతురంతసమాసనంబునన్.

118


వ.

ఇట్లు చతురంతాసనంబున నుండి సకలలోకనాథుండు సత్యభామకు సాక్షి
పదం బొసంగి రుక్మిణీసమ్ముఖంబుగా సమాసీనుండయిన నద్దేవియు.

119
  1. నిసి
  2. తనకలివి (తనుకరివి)
  3. బడనేల
  4. కు
  5. నొక్కటి
  6. దగ
  7. లోగమ
  8. డహారువున (నీ)