పుట:ఉత్తరహరివంశము.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

ఉత్తరహరివంశము


బువ్వాయి గలిగె శౌరికి
మవ్వము దిగఁ దొడఁగె గెలుపు మట్టం బయ్యెన్.

125


గీ.

చాలు నని పాసె రుక్మిణి సత్యభామ
కరము గరమునఁ గీలించి కమలనాభుఁ
డిందు రమ్మనిపిలువ నయ్యింతి నగుచు
నభిముఖంబునఁ బాసిక లందుకొనియె.

126


వ.

పందెంబు చెప్ప రుక్మిణిం చాలించి.

127


సీ.

ఒకదాయ మాడిన నున్నదాయం బాడు
                 మనక వాటులు రెండు గొని చెలంగి
కానని మాటఁ దాఁ గడచి పోయినఁ జెప్పు
                 నెత్తంబు వడ దని నేర్పు దెగడి
యొకదాయమునకును నొంటి దాకినఁ బోయి
                 యింక వైచెద నని యినుమడించి
పోయెడి నని వ్రేయఁ బూచిన వారించి
                 చూచిపో [1]నిమ్మని సూటి చెఱిచి


తే.

సారె మోపును బొరలును సదర నిదర
మెఱిఁగి లాగైనఁగైకొని యించుకంత
పొసఁగకుండిన రుక్మిణి బొంకు బొంక
శౌరిఁ బలుమఱు గెలిచె నా సత్యభామ.

128


క.

నిష్కము మొద లెక్కెన్ ద్విచ
తుష్కాష్టకషోడశాదిదుర్వహశుల్కా
నిష్కములు వెరుగఁగా తో
చిష్కేశద్యోత మగు హృషీకేశుమదిన్.

129


వ.

ఇట్లు విశ్వలోకేశ్వరుండు వినోదించు నవసరంబున.

130

కాశీపతి ద్వారకపైఁ గృత్యను బనుచుట

ఉ.

తాపముఁ గోపముం [2]దలము దోఁకిన బౌండ్రసహాయుఁడైన కా
శ్రీపతి సైఁప లేక హరుచేఁ బడసెన్ పురిదేహదాహసం

  1. బొమ్మని వ్రేటుసూటి
  2. తలఁపు