పుట:ఉత్తరహరివంశము.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

97


గీ.

తేరిపని మానిపిన వాసుదేవుఁ డిలకు
దాఁటి శాతాసి వైచె మాధవునిమీఁదఁ
బదిశరంబులఁ ద్రుంచి గోపాలవిభుఁడు
ముద్దుఁడునుబోలె కన్ను లు మూసికొనియె.

100


చ.

అతఁ డొకశక్తి వైచిన మురాంతకుఁ డంతన రెండు చేసె న
క్షతమదలీల వాఁడు పరిఘంబున వైచినఁ ద్రుంచె బౌండ్రభూ
పతి బహులోహభారదృఢభారదృఢారకఠోరచక్ర ము
ద్ధతిఁ గొని నీతలంబె యిది దాటనఁ నోర్వఁగ నంచు నేసినన్.

101


క.

గగనమున వచ్చుచక్రముఁ
జిగురాకుం బోలెఁ జక్రి చేఁబట్టి వడిన్
మగుడంగఁ ద్రిప్పి వైచిన
బెగడక మైముఱిసి వాఁడు పెల్లుగ నార్చెన్.

102


క.

కడు వెఱఁగంది మురాంతకు
డొడి దప్పినపామువోలె నుండఁగ మఱిఁ [1]దా
నొడిసెల జొన్నల కాచెడి
వడువునఁ బౌండ్రుండు ఱాల వైచెం బెలుచన్.

103

శ్రీకృష్ణుఁడు చక్రమున బౌండ్రునితలఁ దునుముట

మ.

అవి నారాయణుఁ డమ్ములం దునిమె నానాస్త్రంబులం గ్రమ్మఱం
గవియంజేసి యొకింత బీరము సెడం గారించి దైతేయచ
క్రవిదారక్రకచక్రమం బయిన చక్రం బెత్తి తద్దేహముం
బవుల న్వైచినఁ దుంగ వ్రచ్చినగతిం బాసెం బ్రకాశంబుగన్.

104


వ.

ఆ సమయంబున.

105


చ.

హలధరుఁ డేకలవ్యు హృదయంబు గొనన్ ఘనశక్తి వైచినన్
బలుగద వైచె వాఁడు బలభద్రునివక్ష మతండు రెండు సే
తుల గద పూన్చి వైచె నది తోరపుమంటలు మింటనంటఁ బైఁ
బొలసినఁ దేరు డిగ్గి చెడిపోయె నిషాదుఁడు గాందిశీకుఁడై.

106
  1. యున్, వడిసెడిత్రొక్కుల - (కపియుం, గుడిచెడికొన్నల)