పుట:ఉత్తరహరివంశము.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

ఉత్తరహరివంశము


మ.

విను నీవారలఁ బోరిలో గెలిచెదన్ నేఁడెందు [1]వోవచ్చు నీ
కనుమానింపక వాసుదేవుఁ డన నొయ్యారంబునం జెల్ల దె
వ్వనిఁగా జూచితి నన్ను నొక్కగుహలో వర్తింప సింహద్వయం
బునకుం గూడునె యోడునే యొరునికిం బుండ్రక్షమాధీశుఁడున్.

96


ఉ.

నావుడు నవ్వు నెమ్మొగమున న్నెగయంగ జనార్దనుండు రా
రా వెడమాట లాడగ దురాగ్రహ చెల్లదు వాసుదేవసం
భావన నీకు నేఁ గలుగఁ బార్థివు లెన్నరు గాక [2]యెన్నడున్
లావు గొఱంత గాక నిఖిలక్రియచక్రము నీదుచక్రమున్.

97


గీ.

వెండియును గైదువులు నీకు వేఱ కలుగుఁ
బేర కలసొమ్ము దిగుఁ బోర బెండుకంటె
లావు గలవని వింటిమి లజ్జకండ
యొడలఁ గలదేని బలుమాట లుడిగి నడవు.

98


సీ.

అనుచు మురాంతకుం డాపౌండ్రు నొకనిశా
                 తాశుగంబున నేసె నతఁడు బాణ
దశకంబుఁ గంసారిఁ దాఁకించి దారకు
                 నిరువదనమ్ముల నేసి తురగ
ములమేనఁ బదిశరంబులు గ్రుచ్చి వెండియు
                 హరిమీఁద డెబ్బది యమ్ము లేయ
[3]మురవైరి మానసంబున నగి వానిద
                 ర్పము గంద దొడ్డనారసము దొడిగి


తే.

జలజనాభుండు కోదండచతురుఁ డగుచు
గుఱ్ఱములతోడ సారథిఁ గూలనేసి
వారెనయుఁ జక్రరక్షకద్వయముఁ ద్రుంచి
కల్లు బిల్లలు చేసి వెగ్గలము నవ్వె.

99
  1. బ్రొ
  2. యొక్కెడెన్
  3. నగవుతో శౌరి మానసమున వాని ద
    ర్పము మెచ్చి దొడ్డనారసము దొడిగి
    స్థిరము తోడన సారథి శిరము నఱికి
    గుఱ్ఱములు నాలుగమ్ములఁ గూలనేసి