పుట:ఉత్తరహరివంశము.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

ఉత్తరహరివంశము


క.

ఆలోన నెగసి పౌండ్రనృ
పాలుఁడు శైనేయునిటలపట్టిక వ్రేయం
దూలి యతం డంత గదా
భీలాఘాతమున నతనిఁ బిలుకుర వ్రేనెన్.

66


సీ.

అటు వేటువడి పౌండ్రుఁ డంతకుండును బోలెఁ
                 బెడచాళి గద ద్రిప్పి విడిచిపాటు
వైచినఁ బడి యాదవశ్రేష్టుఁ డెన్నఁడేన్
                 చచ్చినయట్లు భూశయ్య నుండి
గ్రమ్మఱఁ దెలిసి యగ్గద రెండుదునుకలు
                 చేసి సముద్భటసింహనాద
వదనుఁ డై యున్న నవ్వాసుదేవుఁడు సొచ్చి
                 యెడమచే సాత్యకి నిఱియఁబట్టి


తే.

కుడికరంబునఁ బిడికిటఁ బొడిచె నురము
వృష్ణివీరుండు నేలతో వీఁవు మోవ
నతని వైచిన నవ్వీరుఁ గతనిఁ గ్రింద
వైచె రెండుసైన్యంబులుఁ జూచుచుండ.

67


వ.

ఇవ్విధంబున మల్లయుద్ధంబునకుఁ దొడంగి.

68


గీ.

కడవరానకు [1]జొచ్చి డొక్కకరము హత్తి
జడికిమై బిడ గొని పట్టెసమునఁ దొడరి
తోరహత్తంబునకుఁ బోఁతమారి బొబ్బ
ణంబునను రింజ వట్టి విన్నాణ మెసఁగ

69


చ.

మఱియు వివిధంబు లగువిన్నాణంబుల నొడిచియు నెమ్ములు నలియఁ బొడి
చియు మండి దాఁకించియుఁ గదయి సోకించియుఁ దల దల [2]నాగించియు భుజంబులు
భుజంబులతో స్రగ్గించియుఁ గక్షంబు కక్షంబులతో ఘట్టించియు వక్షంబు వక్షంబు తో దట్టిం
చియుఁ గరంబులు కరంబులతో నప్పళించియుఁ బిక్కలు పిక్కలతో నుప్పళిం
చియుఁ జరణంబులు చరణంబులతో

  1. జోడొక్కరముహత్తి, చడికి మైబిడ, [బెడగొని] ... బొత్తమూరిజృంభ....వింజపట్టి
  2. భంగిం