పుట:ఉత్తరహరివంశము.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

89


క.

ఈచందంబునఁ దెఱపులు
వేచి యుఁ బయిఁ బూఁచి లాఁచి వేసియుఁ బై పైఁ
ద్రోచురుధిరమునఁ దడిసిరి
పూచిన మోదువుల తోడఁబుట్టువు లనఁగన్.

63


వ.

ఇట్లు సరిసరిం బోరు నవరసంబున సాత్యకి సవ్యమండలప్రచారంబునఁ
బొలసిన వాసుదేవుఁడు వలవంక శంకింపక [1]పక్కళంబు గానీక యర్ధభ్రమణంబున
గదిసి [2]పరిచాళిక చేసిన శైనేయుం డత్తెఱపికి నాసచేయక ముఖచాళి చేసి [3]మురిసి
త్రుళ్ళగించిన నవ్వీరుండు దళపి (ద్రిప్పి) వేసి హాహా యనుటయుం గైటభారి
తమ్ముండు గనలి నిలునిలు మవి యదలించి కక్ష్యావర్తంబు వెనుక కొదిగించి
మెయిచూపిన నచ్చొరవరకు వాసుదేవుండు సీసకంబు [4]పూంచిన శైనేయుండు కుది
కిలి గదను డాకేలు దాపించినం బొంచి చొచ్చినసంతంబునకు మెచ్చి పౌండ్రుండు
కంఠాభరణంబు[5]చాళెంబున గద ద్రిప్పి భుజమధ్యంబు వ్రేసిన సాత్యకి స్వస్తి
కంబుగా నొడ్డి [6]బొంకు బొంకనుటయు నానృపాలుండు గదసుట్టి తివియ వచ్చిన
యదువీరుం డున్నతోడన యెత్తికొన్న నిరువురగదలును మసకంబునం బెనుంగు
పాములపగిదిం దాళించుపాసికలతోలికఁ [7]గ్రేతొటుకరళ్ళకైవడిఁ గలయ బెరయు నిరు
వురు మెయి మలంచి పాసియు డాసియుఁ దట్టియుఁ బట్టియు హత్తియు నొత్తియు
మలంగియుఁ దొలంగియు జడిసియు నొడిసియుం దాఁటియుం దూఁటియు [8]నరలించి
యు ము(వ)దలించియు లాసియు వేసియుఁ దఱిమియు మెఱిమియు నొండొరువుల
దేహంబులు రుధిరాసారంబునం దడిసి కుసుమితకింశుకంబులం బురుడింప లత్తుక
జొతిల్లిన పుత్తళ్ళ విడంబింప గైరికజలంబుల మునిగిన సింగంబులఁ దలఁపింప
నున్న సమయంబున.

64


గీ.

ఆర్చి యెడవంక సాత్యకి యడ్డగింప
వాసుదేవుండు వలవంక వచ్చి యురము
వేయ నవ్వీరుఁ డచ్చోట వ్రేసెఁ దత్త
ఱించి పౌండ్రుఁడు ధర మ్రోకఱిల్లఁ బడఁగ.

65
  1. పగళంబు
  2. యుప్పళి
  3. ముఱుసి తూళగిం
  4. బొడిచిన
  5. వినుచాళింజన
  6. పోనుపోక
  7. గై
  8. నడల్చియు వదల్చియు