పుట:ఉత్తరహరివంశము.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

91


దాఁచియు నడుము లాగించి వైచియు లులాయంబులు మలయుమాడ్కి బులులుఁ దల
పడ్డపోలికఁ గరులు పోరాడుకయివడి సింగంబులు పెనంగుభంగి నుపతాయి[1]తో
నళువాయి నిరువురుం జదిసియుం గదిసియు నచ్చలంబునం జమురు చల్లినమంటల
కయివడిఁ బ్రత్తి తాల్చిన వడువున నిమ్మపండు నలంచిన పగిదిఁ బాదరసంబు
మర్దించు పంతంబునఁ [2]జోళంబు విఱుచు తెఱంగున మనసునం బలిమి లేక విసువక
పరస్పరజయకాంక్షలం బరాక్రమించు నవసరంబున.

70


ఉ.

 రెండు బలంబులందు నరరే యరరే యరరే యనంగ నొం
డొండఁ జెలంగు సన్నుతుల నుబ్బుదు రీయదువీరుఁ జంపుఁ బౌం
డ్రుం డనువారు సాత్యకి కఠోరభుజాపరిఘుండు పౌండ్రభూ
మండలనాథుఁ జంపు ననుమానము లేదనువారుఁ బోరిలోన్.

71


క.

అట్టియెడఁ బుండ్రనందను
దట్టించి యదూద్వహుండు దశముష్టిహతిన్
బిట్టడువ నయిదు ముష్టుల
నెట్టు వొడిచె నతఁడు నొడలు నెళినెళి యనఁగన్.

72

బలరాముఁ డేకలవ్యునితోఁ దలపడి పోరుట

గీ.

అంతలో నేకలవ్యుండు హలధరుండు
నాహవోత్సాహసన్నాహ మతిశయిల్లు
నెక్క టెక్కటిఁ దలపడ్డ నేకలవ్యుఁ
డేసె బలభద్రు నమ్ముల నిరువదింట.

73


క.

ప్రదరంబులు పదియింటం
బదియింటం బదిట రెంటఁ బరువడి నేసెన్
మొదల నరదంబు సూతుం
దుది నేసె న్నారి దునియఁ ద్రుళ్ళి చెలఁగుచున్.

74


ఉ.

అంతట రాముఁ డొండు గొనయం బమరన్ శరముల్ నిషాదసా
మంతునిమేనిలోఁ బది యమర్చి తదీయధనుఃప్రకాండ మిం

  1. లోనమవాయ
  2. బొళయంబుగా