పుట:ఉత్తరహరివంశము.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

83


వాచార్యు గాత్రంబునందు సప్తశరంబు
                 లానకదుందుభి యంగకమున
నాశుగపంచకం బక్రూరుకాయంబు
నం దెనుబదితొమ్మి దమ్ము లుగ్ర


తే.

సేను దేహంబునను గ్రుచ్చి చెలఁగి హస్త
లామవము వింతగా నేకలవ్యుఁ డెచట
నెచట నున్నాఁడు సాత్యకి యెందు వోయె
హలధరుం డని యదలించి యంతఁబోక.

29


మ.

సమదానేకపచక్రవర్తినవకాసారంబుతో నాడుచం
దము చూపం గరదీపికానికరముం దట్టించి రాజన్యసై
న్యము చెలాచెదర[1]య్యు గుంపు లగుచో నవ్వీరుఁ డస్త్రంబులం
జమరం జొచ్చిన నొచ్చి విచ్చి పఱచెన్ జట్రాతిపై పోఁకలై.

30


క.

నలిచప్పుడు లే కమ్మెయిఁ
దొలఁగినసైన్యంబు లెల్లఁ దొడిఁ దొడి నూరం
గలయఁబడి కోటదిక్కులఁ
బలుకక గుజగుజలు వోయెఁ బౌరులు బెగడన్.

31


శా.

ఈచందంబున నేకలవ్యువిజయం బింతంత గాకున్న వీ
రాచారంబు నుతించి పౌండ్రకవిభుం డాత్మీయులం జూచి చే
వీచెం [2]ద్రవ్వుఁడు కోటమేడలు పడన్వ్రేయుండు [3]డాయుండు లెం
డేచూ ఱెవ్వఁడు గొన్న నిత్తునని లావెక్కించె సంరంభియై.

32


వ.

అనుటయు నబ్బలంబునం గలవీరభటసంఘంబు లయ్యవసరంబున.

33


సీ.

వంకదారకుఁ జేరి వాకిటి [4]దద్దడం
                 బులు సేర్చి కొమ్మల మ్రోఁకు వైచి
ప్రాఁకి లోపలఁ జొచ్చి పలుగాఁడిఁ దెఱచిన
                 [5]పంతగార్లకు మున్న బ్రద్దపరుల

  1. యెం మూఁకలగు
  2. ద్రోవుఁడు
  3. పట్టుండు తెం
  4. బద్దకం
  5. పంతగారలుమున్ను