పుట:ఉత్తరహరివంశము.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

ఉత్తరహరివంశము


డుస్సి వ్రేసినం బూసినచందంబున నేలంగూలిన యేనుంగుపీనుంగులును, నేనుంగుల
పీనుంగుల దిగ నుఱికి పాఱు మావంతులును. మావంతులవిన్నాణంబులం బొంగి
మ్రొగ్గుగజంబులగములపై యుగ్యంబులపగ్గంబుల వదలించి పోయినదియు వీథిగాఁ
దఱియ నుఱికిన యరదంబులకు ద్విరదంబు లెదురొగ్గించి కడనొగలు వట్టి
కరంబులం ద్రిప్పి వేయించిన సారథిసహితంబుగాఁ జదిసినరథికులును రథికులకర
లాఘవంబునఁ బఱపుశరపరంపరలచేతం దొరుగురుధిరంబులు కాలువలు గట్టం
గట్టలు గట్టి చూచుసైనికులును సైనికులం బేరుకొని వాసి కెక్కించి పురికొల్పు
కోలలవారి యెలుంగులును జెలంగులును జటుపటహభేరిభాంకారంబులును బుంఖాను
పుంఖనాదంబులును బిరుదకాహళకోలాహలంబులును బలంబులకుఁ జలంబులఁ బెనుప
నినుపపొడి రాల నొండొరుల యలుగు లలుగులఁ బడవ్రేసియు వీడం బోక
డాసియుఁ బోకు పోకని యదలించియుఁ బంతంబులు ముదలించియుఁ జిలుపచిలుప
నెత్తురుల బొత్తిల్లిన నేలం గాలూఁద నేరక జీరువాఱియు మూర్ఛల మునింగి
తేఱియుఁ గైదువుల ఘటించియు నెడగొని చొరవచ్చిన దట్టించియు నంగంబుల
హత్తియు నెమ్ముల సలియనొత్తియు సుభటసందోహంబులు గీలుబొమ్మలచందంబున
[1]మెలఁగాడు తెఱంగున [2]జొత్తుకడతలిలకైవడి సోమంబులపోలిక సంజీవనవిధిజ్ఞుల
విధంబున నసువులదెసకు శంకింపక పోరు నవసరంబున.

27

ఏకలవ్యుఁడు యాదవసైన్యంబు దైన్యంబు నొనరించుట

శా.

వీరాగ్రేసరుఁ డేకలవ్యుఁడు ధనుర్విద్యానవద్యుండు దో
స్సారఖ్యాతి నరాతిరాజుల రణోత్సాహంబు దూరంబుగాఁ
బారావారవిహారమందరగిరిప్రారంభ[3]శుంభద్గతిన్
దే రొప్పారఁగఁ బేరువాడి కలఁచెన్ ధీరోద్దతానీకమున్.

28


సీ.

అయిదుబాణంబులు హార్దిక్యు నొడల మా
                 ర్గణదశకంబు సారణుని మేన
సాయకపంచవిశంతి శుకప్రభు నిశి
                 తప్రదరంబుల దశక ముద్ద

  1. మెఱుఁగారు
  2. జొత్తుకడవలిలకైవడి వాహంబుల
  3. జృంభోద్ధతిన్