పుట:ఉత్తరహరివంశము.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

81


తే.

నంధతమసంబు శ్వేతపింఛాతపత్ర
దీధితులు మ్రింగ వైజయంతీవితాన
మెడములకు నెడమీక మీఁ దెడము కొనఁగఁ
బరఁగి నడతెంచెఁ బౌండ్రభూపాలుసేన.

24


చ.

పరిగొని వచ్చి యాదవులపట్టణ మొక్కటఁ జుట్టుముట్టి యా
హరి పొడ గానరాఁ డల హలాయుధుఁ డెక్కడ వోయె సాత్యకిం
బొరిగొనుఁ డంచు నార్పులును బొబ్బలు నింగిఁ జెలంగఁ బౌండ్రభూ
వరభటకోటి తూర్పుదెసవాకిట భేరులు మ్రోసి డాసినన్.

25


మ.

కరదీపంబులతోడ సామజతురంగస్యందనౌఘంబుతో
వరవీరావలితో బహుప్రహరణవ్యాపారసన్నాహసు
స్థిరతన్ సాత్యకియున్ హలాయుధుఁడు హార్దిక్యుండు లోనైన సం
గరరత్నాకరకర్ణధారులు గడంగ న్వచ్చి రచ్చోటికిన్.

26


వ.

ఇవ్విధంబున నుభయబలంబులుం గదిసిన సందడికయ్యం బయ్యె నయ్యెడ
కరులు గరులను దేరులు దేరులను దురంగంబులు తురంగంబులను బదాతులు
పదాతులనుం దలపడి కత్తివాతియమ్ములం గత్తరించినం దుత్తుమురులగు కత్తళంబు
లును, ఘనగదాఘాతంబులం జిద్రుపలైన సీసకంబులును, ముసలప్రహారంబులం
బఱియ లైన భటకర్పరంబులును, నిశితహేతివిదారణంబుల ఖండఖండంబు లైన
శుండాల శుండాదండంబులును, మొక్కలంబులం బరశుధారలం జెక్కిన నిక్క
డక్కడం బడిన పక్కెరలును, బ్రచండభిండివాలసంక్రీడనంబులం గలయం
గ్రుమ్ముడువడ్డ రథాంగంబులును, దుర్దాంతకుంతసంతాడనంబుల నింతింతలు తునియ
లైన కరిదంతంబులును, నరవాయి గొనక సురియలం జెరివినం దొరుగు రక్తంబులును
నెట్టుకొని సెలకట్టియలవైచిన నిట్టట్టు గదలక తెట్టెలు గొనం గూలిన కాలుబలంబు
లును గాలుబలంబులపైఁ బైకొనక యెక్కి పటవ[1]ణింపలేక తిరుగవచ్చినం జొచ్చి
చక్కడఁచుటయుఁ జాఁపకట్టువడి ఘోటకంబులకింద మిలమిల మెలంగెడు రావు
తులును రావుతుల మోహరంబునకు నోహటించిన బోనీక కరిఘటలం బురికొల్పిన
[2]రాగవాగల నైరావంబునం దురగధట్టంబు నిల్పి తెల్పికొని మగుడం బడి యడిదంబులు

  1. ణివిప్ప
  2. రాగెవాగె; రాగెవాగంబు నైరాగంబునం