పుట:ఉత్తరహరివంశము.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

ఉత్తరహరివంశము

80

నిత్తెఱంగున నతఁ డుత్తలపడి బదరికాశ్రమంబునకు వచ్చి వాసుదేవుం గని
యతనితో నిట్లనియె.

19


శా.

దేవా! దేవరపేరు పెట్టుకొని ధాత్రిన్ వాసుదేవుం డనన్
లావుం జేవయు మీఱి పౌండ్రుఁడు దురాలాపంబులన్ గ్రొవ్వి సి
గ్గేవం బేమియు లేక నీసముఁడ నం చేమేని వాక్రువ్వ మ
ద్భావం బుద్గతరోషవహ్ని యగుడున్ ధట్టించితిం బల్కులన్.

20


తే.

ప్రల్లదంబున నందకపాంచజన్య
శార్ఙ్గకౌమోదకీసుదర్శనము లనఁగ
నలినలోచన నీసాధనముల సాటి
చేసె నతఁడు విశ్వామిత్రసృష్టి వోలె.

21


క.

అనుటయు నారాయణుఁ డను
మునినాయక! వేగపడకు మూఢునిఁ బౌండ్రా
వనివిభుని నీవు సూడఁగఁ
దునుముదు [1]నేఁ డెల్లిలోనఁ దుత్తునియలుగాన్.

22

పౌండ్రుఁడు రాత్రివేళ వచ్చి ద్వారకను ముట్టడించుట

మ.

అనిన న్నారదుఁ డుబ్బె నట్టియెడఁ బౌండ్రాధీశ్వరుం డేకల
వ్యనృపానేకసహస్రసంఖ్యరథకట్యాహాస్తికాశ్వీయసై
న్యనిరూఢిం జతురంగసైన్యమున సాహాయ్యంబుతో నాత్మవా
హిను లేతేర మురారిపట్టణముపై నేఁగె న్నిశీధంబునన్.

23


సీ.

గర్జితానేకపోత్కటదానధారలు
                 జలరాశిరాణివాసముల గెలువ
వల్గదాజానేయవదనఫేనము లంటి
                 నేల చుక్కలతోడినింగిఁ దెగడ
సన్నద్ధపాదాతశస్త్రప్రభాపంక్తి
                 కరదీపరాజిపైఁ గాలుద్రవ్వ
రథ్యా[2]ప్రతీకోత్థరవముచే గిరికోటి
                 పిడుగుల నెఱవిడిఁ బిఱుదుకొనఁగ

  1. నెల్లింటిలొనఁదు
  2. ప్రణీతో; ప్రణీపో.