పుట:ఉత్తరహరివంశము.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

79


రలు వో నాడకు గోపమీరు నొరుపేరం జీరు మీ విక్రమా
ఢ్యులలో నేనును వాసుదేవుఁడ నతండున్ వాసుదేవుండటే.

12


వ.

అనుటయు.

13


చ.

మనమున నోకిలించి మఱుమాటకుఁ గింకిరిపాటు తోడుగా
మునిపతి యల్ల నవ్వి విను మూర్ఖ మురాంతకుఁ బుండరీకలో
చనుఁ ద్రిజగన్నుతున్ సుగుణసాగరుఁ జేరవు గాక శార్ఙ్గితో
బెనఁగుట మంటలో మిడుత బీరము సూపుట గాదె దుర్మతీ!

14


క.

నీశంఖము నీచక్రము
నీశార్ఙ్గము నెఱుఁగమే యనిం గదిసినచోఁ
గేశవసాధనములు గళ
పాశంబులు నీకుఁ దొడరి బ్రతుకఁగ వశమే.

15


క.

ఏనుఁగులాగు పందికి
మానిసిచందంబు నీరుమానిసికి నగుం
గాని గుణంబులు గలుగవు
పూనకు చక్రంబు చక్రి పూనఁగ నెదురన్.

16


ఆ.

త్రుళ్లుఁ[1]బోత నీవు [2]తూలిపోఁ బలికిన
సార మేమి తఱుఁగుఁ జక్రమునకు
నినుము కూడఁ [3]బొరుగ నిది చక్రమా యెత్తు
వచ్చుఁగాన [4]నొరకు వచ్చు నెట్లు.

17


మ.

అనినం బౌండ్రుఁడు చిన్నవోయి హృదయం బల్లాడ నొం డేమి యు
న్మునుకం బాఱక నారదా కినుకకు న్మూలంబు నీ మాటలై
నను శాపాస్త్రుఁడ వైననీకు నవమానం బేను జేయంగ నొ
[5]ల్ల నిజేచ్ఛం జను మింక యాదవుల నెల్లం ద్రుంచి మెచ్చించెదన్.

18


వ.

అనుటయు నమ్మునీంద్రుండు నెమ్మనంబునం దనికిన
యేవంబును
భావంబునం బొడమిన రోషంబును మేలంబునం దెలుపుచు వెలుపలికి వెడలె

  1. గొంగ, గోఁక
  2. దూలపో
  3. బోసి రిది
  4. యొరకు
  5. సే