పుట:ఉత్తరహరివంశము.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

ఉత్తరహరివంశము


మేచకత సహస్రారం
బాచక్రము దోలఁ జాలు నతిభర మగుటన్.

6


తే.

నందకము గూర్చు యాదవునందకంబుఁ
బాంచజన్యంబుచేతఁ దత్పాంచజన్య
మడగు శార్ఙ్గంబుచేఁ జెడు నతని శార్ఙ్గ
మసము సేయదె గద గోపుఁ డెత్తు గదను.

7


ఉ.

నావుడు నేమియు బలుకక నాలుక యాడనిపాటియైన ధా
త్రీవరకోటి యుండ నొకదిక్కున మంత్రులు గూడి యిస్సిరో
యావసుదేవసూనుసరియా యితఁ డంచుఁ తొలంగి రెల్లచో
లావున నీతఁ డెక్కుడని లజ్జలు మానిరి ధూర్త సేవకుల్.

8


శా.

ప్రాలేయాంశుమరీచినిర్మలతనూభాగంబుఁ గృష్ణాజిన
వ్యాలోలామలయజ్ఞసూత్రములు నంసాసక్తవీణాలతా
లాలిత్యంబు లలాటికారుచులుఁ గ్రాల న్నారదుం డిచ్చలం
గైలాసంబున నుండి వచ్చెఁ గలహోత్కస్వాంతుఁ డచ్చోటికిన్.

9


క.

వచ్చిన మునిపతి [1]కర్హణ
మిచ్చిన పిదపన్ మహీశు లెల్లను వినఁగా
మచ్చరపువాసుదేవుఁడు
[2]పెచ్చారితనంబు మ్రానుపిల నిట్లనియెన్.

10

పౌండ్రక వాసుదేవుఁడు వాసుదేవుని నారదునిముందఱ నిందించుట

మ.

మునినాథా! నిఖిలంబు నీకు హృదయాంభోజాతగంధంబు దోఁ
పనియర్థంబులు లేవు నాకు సరి చూపం జాలుదే యాదవుం
డనుమానింపక వాసుదేవుఁ డని మిథ్యాగర్వరథ్యావిడం
బనుఁ డైనన్ [3]వినిపింతుఁగా కతని కీపంతంబుఁ జెల్లింతునే.

11


మ.

కలరే రాజులలో మదీయకరచక్రక్రీడ సైరింపఁ బె
ద్దల భీష్మాదుల ధిక్కరింపఁ దగ దెత్తం జాల రీకైదువో

  1. కర్ఘ్యంభి
  2. పిచ్చాలితనంబు మదిన బెనఁగొన ననియెన్; టెచ్చాలితనంబు మందటిల నిట్లనియెన్
  3. నడపిం