పుట:ఉత్తరహరివంశము.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

ఉత్తరహరివంశము


తోన నిచ్చెన లెక్కి [1]లోనికొత్తళములోఁ
                 బురణించి చొచ్చినపోటుమగల
వాఁడి మెచ్చక యాళువరిమీఁదఁ [2]బాళెల
                 వారిఁ దాఁకించిన వాసిబిరుదు


తే.

లచ్చరువు నొంద మేరలు సొచ్చి యార్చు
[3]దొద్దకార్లచేఁ బఱివోయెఁ దూర్పుదిక్కు
ఱాలవాటుల నటుల ఱంతు మిగిలి
తఱిమి రచ్చడి బలముఁ గొందఱు గడంగి.

34


ఉ.

సామజవాజిముఖ్యబలసంతతి వీఁగిన వృష్ణివీరు లే
మే మనఁ జేవ లేక దమయిండులలోనఁ జొరంగ మందిర
స్తోమము గోపురంబుఁ బడఁద్రోవఁగఁ జప్పుడు మిన్ను ముట్టినన్
దామరపాకునీరువలెఁ దల్లడమందిరి పౌరు లందఱున్.

35


వ.

ఇట్లు చటులతరపరాక్రమంబునం బ్రతిభటబలంబులు దలంకం
బౌండ్రభూపాలుడు యదువీరునగరంబు కలుకోట వికటంబుగా వలుదటంకంబుల
నఱికించియుఁ దంచనపుగుండం బడవైచియు [4]గొంకి క్రుమ్ముడు దగరు మొదలు
గాఁగల సాధనంబులచేఁ జీకాకు పఱిచియు స్వస్తికసర్వతోభద్రనంద్యావర్తపిచ్చంద
కాదిహర్మ్యప్రాసాదసౌధంబులు రూపుమాపించియు వెన్ను దన్ని చూచునవ
సరంబున.

36


మ.

హరివాక్యంబుఁ దలంచి సాత్యకి పురం బాత్మీయరక్షాస్థితిం
[5]జరపన్ వైరులు దొద్దగొన్న పిదపన్ జక్రాయుధుం డెన్నునే
వరవీరావలిలోనఁ దమ్ముఁ డనునే వాక్రుచ్చి నన్నంచు సం
గర సన్నాహము మీఱ నుధ్ధతశతాంగస్ఫారనానాస్త్రుఁడై.

37


క.

దారకునిసుతుఁడు దనకున్
సారథిగా నరద మెక్కి శైనేయుఁడు దు
ర్వారుఁడు దీపపరంపర
బోరనఁ జనుదేర యుద్ధమున కేతెంచెన్.

38
  1. దోని
  2. పల్లెల
  3. దొద్దకాఱుచేఁ బఱివోయె
  4. గొంకుఁగొమ్మతగరు
  5. జగరన్ – దొట్టకొన్న