పుట:ఉత్తరహరివంశము.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

51


రాకలఁ బోకలఁ జక్రముఁ
జేకొని రక్షకులతోడఁ జెప్పి చనఁ దగున్.

93


మ.

పురిచుట్టు న్నిచరుండు సారణుఁడు నీభోజాంధకు ల్గూడి క
త్తెరగాయంబుల గండముం[1]గిళుల సందిం గొమ్మకొమ్మ న్నిరం
తరమున్ [2]సోదనదీవె లెత్తి చనుఁ డుత్తాలధ్వజాభీలగో
పుర భేరీరవభిన్నవైరి హృదయాపూర్ణంబుగా రాత్రులన్.

94


వ.

అని పలికి సాత్యకిం గనుంగొని.

95


మ.

శరకోదండకృపాణకంకటశిరస్త్రాణంబులం బూని సం
గరసన్నాహవిహారి వై నగరరక్షాదక్షతం జూపు శా
ర్వరి నిద్రం బెడిఁబాసి వాదనిగమవ్యాఖ్యానము ల్మాని యె
వ్వరిచేత న్నగుఁబాటు దేక పరభావజ్ఞుండవై తమ్ముఁడా!

96


వ.

అనుటయు సాత్యకి యిట్లనియె.

97
ఉ.

దేవర యానతిచ్చినగతిం గృతకృత్యుఁడ నైతి వీటికిం
గావలి పెట్టి పౌండ్రవిభుకన్నులు గట్టి ప్రలంబవైరికిన్
సేవ [3]యొనర్చి నీ కిచట సిద్ధఫలంబులు గోరి యుండెదన్
దేవత లైన నా కెదిరి ధీరత మైమయిఁ బోవ నేర్తురే.

98


వ.

అనియె నట్టియెడ నమ్మహీధరధరుం డుద్ధవాచార్యున కిట్లనియె:

99


ఉ.

తండ్రులు మీరు మీకు నయతత్తముఁ జెప్పెదమన్న మమ్ము నే
మండ్రు జనంబు, లూఱడు బృహస్పతి మీయెడ, నేను లేనిచో
వెండ్రుకయంతమోసమును వేచి దురంబున కెత్తి వచ్చు నా
పౌండ్రుఁడు వానిచేత మనబంధులు చిక్కకయుండఁ గావుఁడీ.

100


వ.

అని పలికి హలాయుధుం గనుంగొని.

101


మ.

గద చేతం గొని యున్న [4]ని న్నమరదిగ్దంతావళశ్రేణియుం
[5]గదియం జాలదు చాలదుస్తరము మత్కైలాసయాత్రాంతరో
న్మదపౌండ్రక్షితిపాలసంగరము ధీమన్మంత్రిసామంతస
మ్మదశక్తి న్విముఖప్రమాదమతివై మర్దింపు మీ శత్రులన్.

102
  1. గడల
  2. సాదన
  3. నవార్చి
  4. నీయెదుర
  5. గదలం