పుట:ఉత్తరహరివంశము.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

ఉత్తరహరివంశము


శా.

చూడం బోదు గజాపనీతకటఖర్జూభూర్జఖర్జూరలీ
లాడోలాసుఖలేఖలోకమహిళాలంకారహారక్షణ
క్రీడాతారకితాంతరాళతరళశ్రీకంఠకంఠప్రభా
చూడాచంద్రకళాకిలాసము సతీశుద్దాంతకైలాసమున్.

89


ఆ.

బదరికాశ్రమంబుఁ బావనమునిలబ్ధ
విశ్రమంబు నచట విమలయోగ
దీపికాప్రకాశతేజోమయాకారు
భుజగహారు హరుని భువనగురుని.

90


క.

కనుఁగొని నాతలఁచినపని
యనువుపఱిచి మఱిచి యైన నలయక వేగం
బున వత్తు వచ్చునంతకు
మనవీ డేమఱక కాచు మత ముచిత మగున్.

91


సీ.

కోట [1]సింగారించి కొత్తళంబుల నెల్ల
                 నట్టళ్ళు వన్నించి యాళువరికిఁ
బందిళ్ళు పెట్టించి [2]పైకొమ్మ లెగయించి
                 గుండుదూలము వసికొయ్యఁ గూర్చి
యగడిత లీఁతనీ రలవడఁ ద్రవ్వించి
                 వెలిచుట్టిరా [3]ములు వెలుగు వెట్టి
డంచనంబులు దద్దడంబులు నెత్తించి
                 పలుగాఁడితలుపులు బలుపుచేసి


తే.

బాళెము ల్వెట్టి క్రొంకులు బ్రద్దపరులుఁ
గత్తి గొంతంబు లొడిసెళ్ళుఁ గత్తళములు
నారసములును విండులు నగరిలోనఁ
బెట్టి పెట్టుఁడు నడు[4]హట్టి[5]మట్టిలావు

92


క.

ఈకోటకు నొకదిక్కున
వాకిలి సారించి యానవాలుగఁ జారుల్

  1. నిగ్గ
  2. పైకొమ్మ పెట్టించి
  3. వెదుర్వెలుగు
  4. నెట్టి
  5. గట్టి