పుట:ఉత్తరహరివంశము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

49


మానిని వినవే 'పున్నా
మ్నో నరకా త్త్రాయతే' యనుట పుత్త్రార్థం
బైనది నీ కోరిక నా
మానస మలరించె వేదమార్గోచితమై.

82


వ.

అని పలుకుచు నాలీలావతివిలోచనంబులం బొరయు లజ్జావినయదర
హాసంబులకుం దనమేలంబునుం గరుణయు సమేళంబున నెదుర్కొన నారాత్రి వర
లాభంబున బ్రభావిభాసిత యగునద్దేవితో వినోదించి.

83


మ.

మఱునాఁ డంధకభోజవృష్ణియదుసామంతాగ్రణీసేన గం
దెఱగా సాత్యకి రాముఁ డుద్ధవుఁడు హార్దిక్యుండు లోనైన కొం
ద ఱమాత్యుల్ దనుజుట్టిరా నమరె నాస్థానంబునం గృష్ణుఁడా
కఱకంఠుండు పరీతపారిషదరేఖం [1]జూచుచందంబునన్.

84


క.

అప్పరమపురుషుఁ డందఱ
దప్పక కనుఁగొని ప్రసాదదరహాసములన్
ముప్పిరిగొను భాషణముల
నప్పటి కప్పటికి వేడ్క లలర నిటు లనున్.

85


మ.

శిశుతాకేళిఁ దొడంగి గర్వితులఁ గేశిం గంసు జాణూరునిన్
శిశుపాలున్ నరకాదులం బరువడిం జెండాడి సప్తార్ణవీ
రశనారాజవిరాజితక్షితిసతీరత్నప్రభామాలికా
విశదాల్మీయగుోల్లసన్నృపయశోవిక్రాంతిఁ జెల్లించితిన్.

86


చ.

పరఁగినవాఁడు నేఁడు ధరఁ బౌండ్రుఁడు రాజులయం దభంగుఁడై
నరకుఁడుఁ దాను మిత్రములు నాకును వానికి సాటిగాని యె
వ్వరికిఁ దరంబు గాదు యదువంశము మ్రింగుదు నంచు నుండు నీ
శ్వరుఁడు గణంబులం గలసివచ్చిన నంబుధి[2]లోనఁ జొచ్చినన్.

87


వ.

ఇంత సెప్పుటకుఁ గతం బేమియనుతలంపు గలదేని (ంజె ప్పెద)
వినుండు

88
  1. బూఁచు
  2. లోను సొ