పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దాచమన్నాడు” అని చెప్పును. 'బీ' యొక్క కథనము ఆ వ్యవహారములో భాగమ్హైనట్టి సంగతిని విశదపరచునదిగా సంబద్దమైన సంగతి అగును,

(ఎఫ్‌) 'ఏ' దొమ్మీ చేసెనని విచారణ చేయబడుచుండెను. అతడు నాయకుడుగా ఒక గుంపును నడిపించి నట్లు రుజువు చేయబడినది. గుంపుయొక్క కేకలు ఆ వ్యవహార స్వభావమును విశదపరచునవిగా సంబద్దములగును.

ఉమ్మడి పన్నుగడనుచే గురించి కుట్రదారు చెప్పబడినవి లేక చేయబడినవి.

10. ఇద్దరు లేక అంతకెక్కువ మంది వ్యక్తులు కలసి ఒక అపరాధమును లేక ఒక చర్యాయోగ్య దోషమును చేయుటకు కుట్ర పన్నినారని తలచుటకు సహేతుకమైన ఆధారము ఉన్న ఎడల, ఆ వ్యక్తులలో ఏ ఒక్కరి కైనను ఆ ఉమ్మడి ఉద్దేశము తొలుతగా కలిగిన పిమ్మట అట్టి ఉద్దేశమును గురించి వారిలో ఏ ఒక్కరిచే నైనమ చెప్పబడినది, చేయబడినది, లేక (వాయబడినది యేద్దెనను అట్లు కుట్ర పన్నుచున్నట్లుగా తలచబడు వ్యక్తులలో ప్రతి ఒక్కరినిగూర్చియు, ఆ కుట్ర ఉన్నట్టు రుజువు చేయుటకును, అట్టి ఎవరేని వ్యక్తి ఆ కుట్రలో పాల్గొ నెనని చూపుటకును సంబద్దమైన సంగతి అగును.

ఉదాహరణము

భారత ప్రభుత్వముపై యుద్దము చేయుటకై జరిగిన ఒక కుట్రలో 'ఏ' చేరినాడని విశ్వసించుటకు సహేతుకమైన ఆధారము కలదు.

ఆ కుట్ర నిమిత్తము యూరపు దేశములో 'ఏ' ఆయుధములు సేకరించుట 'సీ' అదేమాదిరి లక్ష్మ్యమునక్షె, కలకత్తాలో డబ్బును వసూలు చేయుట, 'డీ' ఆ కుట్రలో చేరవలసినదిగా బొంబాయిలో వ్యక్తులను ప్రేరేపించుట, 'ఈ' ఆలక్ష్యమును సమర్ధించు (వాతలను ఆగ్రాలో ప్రచురించుట, 'ఎఫ్‌ ' కాబూల్‌లో ఉన్న 'జీ ' కి 'సీ ' కలకత్తాలో వసూలు, చేసిన డబ్బును ఢిల్లీనుండి పంపుట, మరియు 'హెచ్‌ ' ఆ కుట్ర యొక్క వృతాంతమును తెలుపుచు వాసిన జాబులో గల విషయములు--వీటితో ప్రతి యొకటియు 'ఏ' కు వాటిలోని అన్నిటినీ గురించి తెలియకుండి నను వాటిని చేసిన వ్యక్తులు అతడెరుగని వారైనను, అతడు ఆకుట్రలో చేరుటకు పూర్వము. లేక ఆ కుట్ర నుండి విడిపోయిన తరువాత అవి జరిగిననై నప్పటికిని ఆ కుట్ర జరిగినదని రుజువు చేయుటకును అందు 'ఏ ' సహాపరాధియని రుజువు చేయుటకును కూడ సంబద్దములైన సంగతులగును. అన్యధా సంబద్దములు కానివి ఎపుడు సంబద్ద సంగతులగును,

11. అన్యథా సంబద్దములు కాని సంగతులు--

(1) అవి ఏదేని వివాదాంశ సంగతికి లేక సంబద్ద సంగతికి విరుద్దముగా ఉన్నచో,

(2) స్వతః గాని ఇతర సంగతులతో కలసిగాని అవి ఏదేని వివాదాంశ సంగతి లేక సంబద్ద సంగతి ఉండుట నైనను లేకుండుటనైనను అత్వంత సంభావ్యము లేక అసంభావ్యము చేయుచో,--

సంబద్దములైన సంగతులు అగును.

ఉదాహరణములు


(ఏ) 'ఏ' ఒకానొక దినమున కలకత్తాలో ఒక నేరమును చేసెనా అనునది ప్రశ్న.

'ఏ' ఆ దినమున లాహోరు లో ఉండుట సంబద్దమైన సంగతి అగును.

ఆ నేరము చేయబడినప్పుడు దాదాపు ఆ సమయములో 'ఏ' ఆ నేరము జరిగిన స్థలమునకు సుదూరమున ఉండుట, అతడు ఆ నేరమును అచటి నుండి చేయుట అసాధ్యము గాకున్నను అత్యంత అసంభావ్వమగునపుడు, సంబద్ద సంగతి అగును.

(బీ) 'ఏ' ఒక నేరము చేసెనా అనునది ప్రశ్న.

పరిస్థితులను బట్టి ఆ నేరము తప్పక 'ఏ' బీ' 'సీ ', 'డీ ' లలో ఒకరు చేసి యుండవలెను. ఆ నేరమును చేయ ఇతరులెవరికిని వీలులేదనియు, దానిని 'బీ' 'సీ లేక 'డీ' చేయలేదనియు చూపు ప్రతి సంగతియు సంబద్ద సంగతి అగును.

నష్ట పరిహారమునకై వేసిన దావాలలొ మొత్తమును నిర్దారణ చేయుటకు న్యాయస్థానమునకు తోడ్పడగల సంగతులు సంబద్దములు.

12. నష్టపరిహారము కోరబడిన దావాలలో ఇప్పించవలసియుండు నష్టపరిహారపు మొత్తమును నిర్ధారణ చేయుటకు న్యాయస్థానమునకు తోడ్పడు ఏ సంగతి అయినను సంబద్దమైనదగును.