పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జరిగినదని చెప్పబడిన ఆ మానభంగమునకు పిమ్మట కొద్దిసేపటికి ఆమె ఆ నేరమును గురించి ఫిర్యాదుచేయుట, ఫిర్యాదుకు. దారితీసిన పరిస్థితులు, ఫిర్యాదునందలి మాటలు, సంబద్దములైన సంగతులు అగును.

ఆమె ఫిర్యాదు చేయకయే తనకు మానభంగము వాటిల్లినట్లు చెప్పుట, ఈ పరిచ్చేదము క్రింద ప్రవర్తనగా సంబద్దమ్హైనది కాదు, కాని 32వ పరిచ్చేదము యొక్క ఖండము (1) క్రింద మరణ వాజ్మూలముగా గాని, 157వ పరిచ్చేదము క్రింద బలపరిచే సాక్ష్యముగా గాని సంబద్దమైనది కావచ్చును.

(కే) 'ఏ' ని దోచుకొనిరా యనునది ప్రశ్న.

జరిగినదని చెప్పబడిన ఆ దోపిడికి పిమ్మట వెంటనే అతడు ఆ అపరాధమును గురించి ఫిర్యాదు చేయుటయు ఫిర్యాదుకు దారితీసిన పరిస్థితులు ఫిర్యాదునందలి మాటలు సంబద్దములైన సంగతులు అగును.

అతడు. ఫిర్యాదు చేయకనే తాను దోపిడీకి గురియైనట్లు చెప్పుట ఈ పరిచ్చేదముు క్రింద ప్రవర్తనగా సంబద్దము కాదు. కాని 32వ పరిచ్చేదము యొక్క ఖండము (1) క్రింద మరణ వాజ్మాలయముగా గాని 157వ పరిచ్చేదము క్రింద బలపరిచే సాక్ట్యముగా గాని సంబద్దమైనది కావచ్చును.

సంబద్ద సంగతులను విశదీకరించుటకు లేక ప్రవేశపెట్టుటకు ఆవశ్యకములైన సంగతులు.

9. ఒక వివాదాంశ సంగతిని గాని సంబద్ద సంగతిని గాని విశదీకరించుటకై నమ ప్రవేశ పెట్టుటకైనను ఆవశ్యకమైనట్టి , లేక వివాదాంశ సంగతి వలనగాని సంబద్ద సంగతి వలనగాని తట్తిన ఒక ఊహను బలపరచు. లేదా ఖండించునట్టి, లేక ఏదేని వస్తువుదై నను వ్యక్తిద్దై నను ఆనవాలు సంబద్దమయినదిగా ఉన్నపుడు, ఆ ఆనవాలును స్థిరపరచునట్టి, లేక ఏదేని వివాదాంశ సంగతి గాని సంబద్ద సంగతిగాని జరిగిన సమయమునై నను స్తలమునై నను నియతము చేయునట్టి లేక ఏదేని అట్టి సంగతిని గూర్చిన వ్యవహారములో పాల్గొనిన పక్షకారుల సంబంధమును తెలియజేయునట్టి సంగతులు అందు నిమిత్తమై ఆవశ్యకమైనంతవరకు, సంబద్దములైన సంగతులు అగును.

ఉదాహరణములు

(ఏ) ఒకానొక దస్తావేజు 'ఏ' యొక్క. వీలునామాయేనా అనునది ప్రశ్న.

అటులని చెప్పబడిన ఆ వీలునామా తేదీన 'ఏ' కి గల అస్తి యొక్కయు. అతని కుటుంబము యొక్కయు పరిస్తితులు సంబద్దములైన సంగతులు కావచ్చును.

(బీ) 'ఏ' కు అప్రతిష్టకరమైన ప్రవర్తనను అపాదించు నిందా లేఖన విషయమున 'బీ' పై 'ఏ' దావా వేయును; నిందా లేఖనమని చెప్పబడిన ఆ విషయము సత్యమేనని 'బీ' ఉద్ఘాటించును.

నిందాలేఖన ప్రచురణ కాలమున పక్టకారుల స్థితిగతులు సంబంధములు వివాదాంశములైన సంగతులను ప్రవేశపెట్టునవిగా సంబద్దముల్టెన సంగతులు కావచ్చును.

అట్లు చెప్పబడిన నిందా లేఖనముతో సంబంధము లేని విషయమును గూర్చి 'ఏ' 'బీ' మధ్య గల వివాదము యొక్క వివరములు అసంబద్దములు, కాని, 'ఏ' 'బీ' ల మధ్య వివాదము ఉండెను అను సంగతి అది వారికిగల సంబంథములపై ప్రభావము గలదైనచో సంబద్దము కావచ్చును.

(సీ) 'ఏ' పై ఒక నేరము మోపబడెను.

నేరము జరిగిన వెంటనే 'ఏ' తన ఇంటినుండి పరారీ అగుట వివాదాంశ సంగతులకు తరువాతిదియును వాటి ప్రభావమునకు గురియై, నదియునైన ప్రవర్తనగా 8వ పరిచ్చేదము క్రింద సంబద్దమైన సంగతి అగును.

అతడు ఇంటినుండి వెడలిన సమయమున అతనికి తాను పోవుచున్న స్థలములో హఠాత్తుగా అత్యవసరమైన పని తగిలి యుండుట అతడు హఠాత్తుగా ఇంటినుండి వెడలిన సంగతిని విశదపరచు న్హైఖరి కలదిగా సంబద్దమైన సంగతి అగును.

అతడు ఏ పనికై వెడలెనో ఆ వివరములు, ఆ పని హఠాత్తయినదియు, అత్యవసరమైనదియు అని చూపుటకు అవశ్యకమై నంత మేరకు తప్ప, సంబద్దములు కావు.

(డీ) తనతో, 'సీ' చేసికొనిన నౌకరీ కాంట్రాక్టును భంగపరచునట్లు 'సీ' ని ప్రేరేపించినాడని 'బీ' పై 'ఏ' దావా వేయును. 'ఏ' వద్ద నౌకరీని వదలివేసినప్పుడు, 'సీ' “నాకు 'బీ' ఇంతకంటే మంచి నౌకరీని ఈయజూపినందున నేను వెళ్ళి పోవుచున్నాను” అని 'ఏ' తో చెప్పెను. ఈ కథనము వివాదాంశ సంగతిగా సంబద్దమయినట్టి 'సీ' యొక్క ప్రవర్తనను విశదపరచునదిగా సంబద్దమైన సంగతి అగును.

(ఈ) దొంగతనపు నేరము మోపబడిన, 'ఏ' అనునతడు దొంగిలింపబడిన ఆస్తిని 'బీ' కి ఇచ్చుటయును 'బీ' ఆ అస్తిని 'ఏ' భార్యకు ఇచ్చుటయును. చూడబడినవి.. 'బీ' ఆ ఆస్తిని అందజేయుచు 'ఏ' దీనిని నిన్ను