పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశదీకరణము 1:-- ఈ పరిచ్చేదములో “ ప్రవర్తనము” అను పద పరిధి యందు కథనములు చేరవు. అయితే, కథనములు కానట్టి ఏవేని ఇతర కార్యముల ననుసరించియుండి వాటిని విశదపరచు కథనములు చేరియుండును, మరియు ఈ చట్టపు ఏదేని ఇతర పరిచ్చేదము క్రింద కథనములకు గల సంబద్దతకు ఈ విశదీకరణము భంగము కలిగించదు,

విశదీకరణము 2:-- ఎవరేని వ్యక్తి యొక్క ప్రవర్తన సంబద్దమైనదై నపుడు అట్టి ప్రవర్తనపై ప్రభావము కలిగియుండి, అతనికి తెలుపబడినట్టి లేక అతని సమక్షమున అతనికి వినిపించు మేరలో తెలుపబడినట్టి ఏ కథనమైనను సంబద్దమైనదగును.

ఉదాహరణములు

(ఏ) 'బీ' యొక్క హత్య విషయమున 'ఏ' విచారణ చేయబడుచుండెను. 'సీ' ని 'ఏ' హత్య చేసియుండుట 'సీ' ని 'ఏ' హత్య చేసినాడని 'బీ' కి తెలిసియుండుట, తనకు తెలిసిన విషయమును వెల్లడి చేసెదనని బెదరించి 'ఏ' నుండి డబ్బు గుంజుటకు 'బీ' ప్రయత్నించియుండుట అనునవి సంబద్ద సంగతులు.

(బి) ఒక బాండు మీద రావలసిన డబ్బు చెల్సించుమని. 'బీ' పై 'ఏ' దావావేయును. 'బీ' ఆ బాండుని తాను వాసి ఈయలేదనును.

బాండును (వాసి యిచ్చినట్ను చెప్పబడిన సమయమున ఒకానొక నిమిత్తము 'బీ' కి డబ్బు ఆవసరమై యుండెననునది సంబద్దమైన సంగతి.

(సీ) విషప్రయోగముచే 'బీ' ని హత్య చేసినాడనీ 'ఏ' విచారణ చేయబడుచుండెను. 'బీ' మరణించుటకు పూర్వము 'బీ' కి పెట్టబడినటువంటి విషమునే 'ఏ' సేకరించినాడు అనునది సంబద్దమైన సంగతి.

(డీ) ఒకానొక దస్తావేజు. 'ఏ' యొక్క. వీలునామాయేనా అనునది ప్రశ్న.

'ఏ' దని చెప్పబడిన వీలునామా తేదీకి కొద్దికాలము క్రితమే ఆ వీలునామాలోని నిబంధనలకు సంబంధించ విషయములను గురించి 'ఏ' దర్యాప్తు జరుపుట, అతడు ఆ వీలునామా (వాయుటను గూర్చి వకీళ్ళను సంప్రదించుట మరియు అతడు ఇతర వీలునామాలకు ముసాయిదాలను తయారుచేయించి ఆమోదించకుండుట ఆనునవి సంబద్దములైన సంగతులు.

(ఈ) 'ఏ' పై ఒక నేరము మోపబడెను.

మోపబడిన ఆ నేరము జరుగుటకు పూర్వము లేక జరుగు సమయమున లేక అటు పిమ్మట ఆ కేసు యొక్క సంగతులు తనకు అనుకూలముగా అగుపడునట్టుజేయు న్నెఖరి గల సాక్ట్యము 'ఏ' సమకూర్చుకొనుట లేక అతడు సాక్ట్యమును నాశనము చేయుట, లేక మరుగుపరచుట లేక సాక్షులు కాదగు వ్యక్తులు హాజరు కాకుండ నివారించుట లేక వారు హాజరు కాకుండునట్టు చేయుట లేక నేరమును గూర్చి తప్పుడు సాక్ట్య ము ఇచ్చుటకు వ్యక్షులను సిద్దము చేయుట అనునవి సంబద్దములైన సంగతులు.

(ఎఫ్‌) 'బీ'ని 'ఏ' దోచుకొనెనా అనునది ప్రశ్న.

'బీ' దోపిడికి గురియైన పిమ్మట "'బీ' ని దోచుకొనిన వానిని పట్టుకొనుటకై. పొలీసులు వచ్చుచున్నారు” అని 'సీ' 'ఏ' సమక్షమున చెప్పుట, ఆ వెనువెంటనే 'ఏ' పారిపోవుట అనునవి సంబద్దములై న సంగతులు అగును.

(జీ) 'బీ' కి 10,000 ల రూపాయలు 'ఏ' బాకీయుండెనా అనునది ప్రశ్న.

తనకు డబ్బు అప్పు ఇమ్మని 'సీ' ని 'ఏ' అడుగుట 'ఏ' సమక్షమునను అతడు వినునట్లు గాను 'డీ' “10,0006 రూపాయలు 'బీ' కి 'ఏ' బాకియున్నాడు. కావున 'ఏ' ను నమ్మవద్దని నేను మీకు సలహాఇచ్చుచున్నాను” అని 'సీ' తో చెప్పుట, మరియు అంతట ఎట్టి జవాబు ఈయకుండ 'ఏ' వెళ్ళిపోవుట అనునవి సంబద్దముల్దెన సంగతులు అగును.

(హెచ్‌) ఒక నేరమును 'ఏ' చేసెనా అనునది ప్రశ్న.

నేరస్థుని కొరకు దర్యాప్తు జరుగుచున్నట్లు హెచ్చరిక చేయుచు ఒక జాబు తనకు అందిన పిమ్మట 'ఏ' పరారీ అగుట, మరియు ఆ జాబులోని విషయములు, సంబద్ధములై న సంగతులు అగును.

(ఐ) 'ఏ' ఒక నేరము మోపబడెను,

మోపబడిన ఆ నేరము జరిగిన తరువాత అతడు పరారీ అగుట, లేక ఆ నేరము ద్వారా ఆర్జింపబడిన ఆస్తి నిగాని ఆ అస్తి అమ్మకపు రాబడిని గాని స్వాధీనము నందు అతడు ఉంచుకొనుట, లేక నేరము చేయుటలో ఉపయోగింపబడిన లేక ఉపయోగింపదగిన వస్తువులను మరుగు పరచుటకు ప్రయత్నించుట అనునవి సంబద్దములైన సంగతులు అగును.

(జే) 'ఏ' మానభంగమునకు గురియైనదా అనునది ప్రశ్న.