పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(బీ) ఒక కక్టిదారు కేసు మొదటి అకర్షన సమయమున తాను ఆధారపడియున్న బాండును తనతో తీసికొనిరాడు, దాఖలు చేయుటకు సిద్దపరచడు. ఆ చర్యయొక్క ఏదేని తరువాతి దశయందు సివిలు ప్రక్రియాస్మృతిలో విహితవపరచబడిన షరతులననుసరించి కాక అన్యథా ఆ బాండును దాఖలు చేయుటకు గాని దానిలోని విషయములను రుజువు పరచుటకు గాని ఈ పరిచ్చేదము అతనికి వీలు కల్పించదు.

ఒకే వ్యవహార భాగములై యుండు సంగతుల సంబద్దత.

6. వివాదాంశములు గాకున్నను ఒక వివాదాంశ సంగతితో ఒకే వ్వవహరములో భాగమగునంతగా కలిసియున్న సంగతులు అవి ఒకే సమయమునను, స్థలమునను జరిగినవె నను, లేక విభిన్న సమయములలోను స్థలములలోను జరిగినవె నను, సంబద్దములగును,

ఉదాహరణములు

(ఏ) 'ఏ' అనునతనిపై 'బీ' ని కొట్టి హత్యచేసెనను నేరము మోపబడినది. కొట్టిన సమయముననై నను అంతకు కొంచెము ముందుగా లేక తరువాతనై నను ఒకే వ్యవహార భాగములయిఉండునంత దగ్గరలో 'ఏ' చేగాని 'బీ' చే గాని ప్రేక్షకులచే గాని చెప్పబడినది లేక చేయబడినది ఏదైనను సంబద్దమైన సంగతి అగును.

(బీ) ఆస్తి నాశనము, సైనికదళములపై దాడి, జైళ్ళ భేదనము జరిగియుండిన సాయుధ పోరాటములో పాల్గొనుట ద్వారా భారత ప్రభుత్వము పై యుద్దము చేసెనని 'ఏ' పై నేరము మోపబడినది. వాటన్నిటిలో 'ఏ' పొల్గొనక పోయినను ఈ సంగతులు జరిగియుండుట ఆ మొత్తము వ్యవహారములో భాగమగుటవలన సంబద్దమైనదగును.

(సీ) ఉత్తర ప్రత్యుత్తరములలోని భాగముగు ఒక జాబునందలి నిందాలేఖనమును గూర్చి 'బీ' పై 'ఏ'దావా వేయును. ఆ నిందా లేఖనము ఉత్పన్నమై న విషయమునకు సంబంధించి పక్షకారుల మద్య నడచిన ఉత్తర ప్రత్యుతరములలో భాగములగు జాబులు ఆ నిందా లేఖనము స్వతః వాటియందు. లేకపోయినను, సంబద్ద సంగతులగును.

(డీ) కొన్ని సరుకులను పంపవలసినదిగా 'బీ' కి ఈయబడిన ఉత్తరువును బట్టి అవి 'ఏ' కు అందజేయబడినవా అనునది (పశ్న. ఆ సరుకులు మద్యలో అనేక మంది వ్యక్తులకు వరుసగా అందజేయబడెను. ఆ ప్రతి అందింపు సంబద్ద సంగతి అగును.

వాదాంశ సంగతులకు సందర్భము, హేతువు లేక పరిణామము అగు సంగతులు,

7. సంబద్హ సంగతులను లేక వివాదాంశ సంగతులను, అవ్యవహితముగానై నను అన్యథాయై నను కలుగజేసినట్తి లేక వాటికి హేతుభూతమ్హైన లేక వాటి పరిణామాత్మకమై నట్టి లేక అవి జరుగుటకు పరిస్టితులుగా ఏర్పడినట్టి లేక అవి ఘటిల్లుటకు గాని వ్యవహారాత్మకమగుటకు గాని అవకాశము ఇచ్చినట్టు సంగతులు సంబద్దమైనదగును.

ఉదాహరణములు


(ఏ) 'బీ' ని 'ఏ' దోచుకొనెనా అనునది ప్రశ్న.

ఆ దొపిడికి కొంచెము ముందుగా 'బీ' పైకముతో సంతకు వెళ్ళుట, మరియు. ఇతర వ్యక్తులకు అతడు ఆ పైకమును చూపుట, లేక తనవద్ద పైకము ఉన్న సంగతిని వారికి చెప్పుట అను సంగతులు సంబద్తమైన వగును.

(బీ) 'బీ' ని 'ఏ' హత్య చేసెనా అనునది ప్రశ్న.

హత్య జరిగిన చోటగాని, తత్సమీపమున గాని, పెనగులాటవలన నేలపై ఏర్పడిన గుర్తులు సంబద్దమైన సంగతులగును.

(సీ) 'బీ' ని 'ఏ' విష ప్రయోగము చేసెనా అనునది ప్రశ్న.

విషప్రయోగ లక్షణములు కాన్పించక పూర్వము 'బీ' యొక్క ఆరొగ్య స్థితియు, 'ఏ' కు తెలిసినవె విషప్రయోగమునకు అవకాశము కల్పించినట్టి 'బీ' యొక్క అలవాట్లను, సంబద్దమైన సంగతులగును.

ప్రేరకహేతువు సన్నద్ధత పూర్వపు లేక తరువాతి ప్రవర్తన,

8. ఏదేని వివాదాంశసంగతి లేక సంబద్ద సంగతి విషయమున ప్రేరక హేతువునై నను, సన్నద్దతనై నను చూపు నట్టి లేక సంఘటించునట్టి ఏ సంగతి యైనను సంబద్దమైనదగును.

ఏదేని దావాకు లేక చర్యకు సంబంధించి. లేక అందలి ఏదేని వివాదాంశసంగతికి గాని దానికి సంబద్దమైన సంగతికి గాని సంబంధించి, అట్టి దావాలో లేక చర్యలో ఎవరేని పక్ష కారుని యొక్క లేక ఆపక్ట కారుని ఏజెంటు యొక్క ప్రవర్తనయు, ఏదేని చర్యాగతమైన అపరాధము ఆరొపింపబడిన ఎవరేని వ్యక్తి యొక్క ప్రవర్తనయు, అట్టి ప్రవర్హన ఏదేని వివాదాంశ సంగతిపై గాని సంబద్హ సంగతిపై గాని ప్రభావము గల్గి యున్నద్డైనచో లేక వాటి ప్రభావమునకు తాను గురియైనదైనచో, అ సంగతికి ఆది పూర్వపుదైనను తరువాతి దైనను సంబద్దమైనదగును.