పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అట్టి కధనములు వ్యాగూప సాక్ష్యమనబడును.

(2) న్యాయస్థానపు తనిఖీకై దాఖలు చేయబడిన దస్తావేజులన్నియు;

అట్టి దస్తావేజులు దస్తావేజీసాక్ష్యము అనబడును.

“రుజువై నది "

న్యాయస్థానము, తన సమక్షమునగల విషయములను పర్యాలోచించిన మీదట, ఒక సంగతి ఉన్నదని విశ్వసించి నవుడుగాని ఆ ప్రత్యేక కేసు. పరిస్తితులను బట్టి ఒక ప్రాజ్జుడు అది ఉన్నదను ఊహతో వ్యవహరించ వలసియుండు నంత సంభావ్యమై నదిగా ఉన్నదని తలచినపుడుగాని, ఆ సంగతి రుజువె నట్లు చెప్పబడును.

“నిజముకాదని రుజువై నది "

న్యాయస్థానము, తన సమక్షమునగల విషయములను పర్యాలోచించిన మీదట ఒక సంగతి లేదని. విశ్వసించి నపుడు ఘాని, ఆ ప్రత్యేక కేసు పరిస్తితులము బట్టి ఒక ప్రాజ్జుడు అది లేదను ఊహతో వ్యవహారించవలసి యుండునంత సంభావ్యమై నదిగా వున్నదని తలచి నప్పుడుగాని ఆ సంగతి నిజము కాదని రుజువై నట్లు చెప్పబడును.

“రుజువు కాలేదు”

ఒక సంగతి నిజమనిగాని నిజముకాదని గాని రుజువు కానప్పుడు అది రుజువు కాలేదని చెప్పబడును,

“భారతదేశము”

"భారత దేశము " అనగా జమ్ము——కాశ్మీరు. రాజ్యము మినహా భారత దేశ రాజ్య క్షేత్రము అని అర్ధము.

“పురొభావన చేయవచ్చును"

4. ఒక సంగతిని న్యాయస్థానము పులోభావన చేయవచ్చునని ఈ చట్లములో నిబంధనలున్నప్పుడెల్లను అది నిజము కాదని రుజువై ననే తప్ప మరియు అంతవరకు, ఆ సంగతి రుజువై నదని న్యాయస్థానము ఎంచవచ్చును, లేదా దానిని రుజువు పరచుమని కోరవచ్చును.

“పురొభావన చేయవలెను”

ఒక సంగతిని న్యాయస్థానము. పురొభావవ చేయవలెనని ఈ చట్టము ద్వారా ఆదేశింపబడిన ప్పుడెల్లన ఆది నిజముకాదని రుజువై ననే తప్ప మరియు అంతవరకు ఆ సంగతి రుజువ్నెనదని న్యాయస్థానము ఎంచవలెను.

“నిశ్చాయక రుజువు"

ఈ చట్టము ద్వారా ఒక సంగతి వేరొక దానికి నిశ్చాయక రుజువు అని ప్రఖ్యానింపబడినపుడు, న్యాయస్థానము ఆ ఒక సంగతి రుజువైన మీదట ఆ వేరొక సంగతియు రుజువై నట్టు ఎంచవలెను, మరియు ఆ వేరొక సంగతి నిజముకాదని రుజువుపరచుటకై సాక్ట్యమును చేకొనరాదు.

అధ్యాయము-2

సంగతుల సంబద్ధతను గురించి

వివాదాంశ సంగతులను మరియు సంబద్ద సంగతులను గూర్చి సాక్ట్యము ఈయవచ్చును,

5. ఏదేని 'దావాలో లేక చర్యలో అందలి అన్ని వివాదాంశ సంగతులను గురించియు, ఇందు ఇటు పిమ్ముట సంబద్దమైనవని ప్రఖ్యానింపబడినవగు ఇతర సంగతులను గురించియు, అవి ఉన్నవనిగాని లేవని గాని సాక్ష్యము ఈయవచ్చును ఏ ఇతర వాటినిగురించియు ఈయరాచు.

విశదీకరణము;-- సివిలు ప్రక్రియకు సంబంధించి తత్సమయమున అమలునందుండు. శాసనము యొక్క ఏదేని నిబంధన క్రింద ఏ వ్యక్తి కైనను రుజావు చేయుటకు హక్కులేని సంగతిని గురించి సాక్ష్యము ఇచ్చుటకు అతనికి ఈ పరిచ్చేదము వీలు కల్పించదు.


ఉదాహరణములు

(ఏ) 'బీ' ని చంపవలెనను ఉద్దేశముతొ ఆతనిని ఒక బడితెతొ కొట్టి హతం చేసినాడని 'ఏ 'విచారణ చేయబడుచుండును.

"ఏ" యొక్క విచారణలో ఈ క్రింది సంగతులు వివాదాంశములగును:

'ఏ' దుడ్డుకర్రతో 'బీ' ని కొట్టుట:

'ఏ' అట్లు కొట్టుట ద్వారా 'బీ' యొక్క మరణమునకు కారకుడగుట:

'బీ' ని చంపవలెనని 'ఏ' కు గల ఉద్దేశము.