పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదాహరణములు

(ఏ) ఒకానొకచోట కొన్ని వస్తువులు ఒకానొక తీరుగా అమర్చబడియున్నవి అనునది ఒక సంగతి.
(బీ) ఒకడు దేనినైనను వినెను లేక చూచెను అనునది ఒకసంగతి.
(సీ) ఒకడు కొన్ని మాటలను చెప్పెను అనునది ఒక సంగతి.
(డీ) ఒకనికి ఒకానొక అభిప్రాయము గలదు ఒకానొక ఉద్దేశము గలదు, అతడు సద్భావముతో వ్యవహరించును లేక కపటముతో వ్యవహరించును: లేక ఒక విలక్షణమైన మాటను ఒక విలక్షణమైన అర్దములో వాడును: ఒకడు ఒక విలక్షణమ్హైన అనుభూతిని ఒక నిర్ధిష్ట సమయములో గుర్తెరిగియున్నాడు, లేక గుర్తెరిగి యుండెను అనునది ఒక సంగతి, -
(ఈ) ఒకనికి ఒక తరహా ఖ్యాతి ఉన్సది ఆనునది ఒక సంగతి.

"సంబద్ద "

సంగతుల సంబద్దతను గూర్చి ఈ చట్టపు నిబంధనలలొ నిర్దేశింపబడిన ఏ రితిలో నైనను ఒక సంగతి మరొక సంగతితో సంబంధము గలిగియున్నప్పుడు, ఆ సంగతి ఆ మరొక సంగతికి సంబద్దమై యున్నదని చెప్పబడును.

"వివాదాంశ సంగతులు "

వివాదాంశ సంగతులు అనగా మరియు ఆ పదబంథ పరిధిలో చేరియుండునవి:——

ఏ సంగతి నుండి విడిగా దానినుండియేయై నను, ఇతర సంగతుల కలయికతోనై నను, ఏదేని దావాలో లేక చర్యలో ఉన్నదని గాని, లేదనిగాని చెప్పబడిన ఏదేని హక్కు, బాధ్యత లేక నిరర్హత ఉన్నదో లేదో అనునది గాని, దాని స్వభావము లేక విస్తృతి ఎట్టిదో అనునది గాని అవశ్యముగా ఉహింపదగునో ఆ సంగతి.

విశదీకరణము:— సివిలు ప్రక్రియకు సంబంధించి తత్పమయమున అమలునందుండు శాసన నిబంధనల క్రింద ఏదేని న్యాయస్థానము ఒక సంగతిని గూర్చిన వివాదాంశముము రికార్డు చేసినపుడెల్లను, అట్టి వివాదాంశమునకు జవాబు నందు అ ఆంశము ఉన్నదనెడు లేక లేదనెడు సంగతి, ఒక వివాదాంశ సంగతి అగును.

ఉదాహరణములు

'ఏ' అనునతనిపై 'బీ' ని హత్య చేసెనని నేరము మోపబడినది. ఆతని విచారణలో ఈ క్రింది సంగతులు వివాదాంశములు కావచ్చును:—

'బీ' యొక్క మరణమునకు 'ఏ' కారకుడయ్యెను ఆనునది:
'బీ' ని చంపవలెనని “ఏ” ఉద్దేశించెను అనునది;
'బీ' చే తీవరమైన మరియు ఆకస్మికమైన ప్రకోపమునకు 'ఏ' గురి చేయబడెను అనునది:
'బీ'కి మరణహేతువైనవ కార్యమును చేయుసమయమున ఆ కార్యపు స్వభావమును తెలిసికొనుటకు 'ఏ' మతిస్తిమితము లేని కారణమున అశక్తుడ్డై యుండెను అనునది.

“దస్తావేజు”

“దస్తావేజు” అనగా ఏదేని విషయమును ఏ పదార్ధముమీదనై నను రికార్డు చేయునిమిత్తమై ఉద్దేశింపబడిన లేక ఉపయోగింపదగిన అక్షరముల, అంకెల లేక గుర్తుల ద్వారా గాని వాటిలో ఒకటి కన్న ఎక్కువ పద్దతుల ద్వారా గాని, తెలుపబడినట్టి లేక వర్ణింపబడినట్టి విషయము, అని అర్భము.

ఉదాహరణములు

(వాతమూలకమైనది దస్తావేజగును.

ముద్రిత, శిలాముద్రిత, లేక ఛాయాచిత్రిత పదములు దస్తావేజులగును:

ఒక మ్యాపు లేక ప్లాను దస్తావేజగును:

ఒక ధాతుఫలకముపై లేక శిలపై చెక్కబడినది దస్తావేజగును;

ఒక వంగ్య చిత్రము దస్తావేజగును;

"సాక్ట్యము"

'సాక్ట్యమూ అనగా మరియు ఆ పద పరిధిలో చేరియుండునవి:—

(1) న్యాయస్థాన సమక్షమున. పరిశీలనలోనున్న సంగతుల గూర్చిన విషయములకు సంబంధించి న్యాయ స్థానపు అనుజ్క్షతోగాని ఆదేశముపై గాని సాక్షులు తెలియజేయు. అన్ని కథనములు;