పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారత సాక్ష్య చట్టము, 1872.

(1872 లోని 1వచట్టము)

(15 మార్చి 1872)

ప్రస్తావన : సాక్ట్యశాసనమును ఏకీకరించుట, వివరించుట మరియు సవరించుట ఉపయుక్తమ్హైనందున ఇందుమూలముగ ఈ క్రింది విధముగ శాసనము చేయబడినది.

భాగము -I

సంగతుల సంబద్ధత

అధ్యాయము - 1

ప్రారంభిక

సంగ్రహ నామము విస్తరణ మరియు ప్రారంభము.


1. ఈ చట్టమును. భారత సాక్ట్య చట్టము 1872 అని పేర్కొనవచ్చును.

ఇది జమ్మూ-కాళ్మీరు రాజ్యము మినహా యావద్బారతదేశమునకు విస్తరించును మరియు ఆర్మీ చట్టము(44 మరియు 45 విక్టొ అ. 58 ) నేవల్‌ డిసిప్పిన్‌ చట్టము, ( 29. మరియు. 30 విక్టొ అ. 109) లేక ఇండియన్‌ నేవీ ( డిసిప్టిన్‌ ) చట్టము, 1934 ( 1934లోని 34వ చట్టము ) లేక ఎయిర్‌ఫోర్సు చట్టము. (7వ జార్జి 5, ఆ. 51) క్రింద సమావేశపరచబడు సేనాన్యాయస్థానములు తప్ప ఇతర సేనాన్యాయస్థానములతో సహా ఏదేని న్యాయస్థానమునందుగాని, న్యాయస్థాన సమక్షములోగాని, జరుగు సమస్త న్యాయిక చర్యలకు వర్తించును. కాని ఏద్దెన న్యాయస్థానమునకు, లేక అధికారికి సమర్చింపబడు అఫిడవిట్లకుగాని, మధ్యవర్తి సమక్షమున జరుగు చర్యలకు గాని వర్తించదు;

మరియు ఇది 1872 సెస్పెంబరు మొదటి దినమున అమలులోనికి వచ్చును,

2.. ( రద్దు చేయబడినది. )

3. ఈ చట్టములో, సందర్భరీత్యా అందుకు విరుద్దమైన ఉద్దేశము గోచరించిననే తప్ప, ఈ క్రింది పదములు మరియు పదబంధములు ఈ క్రింది అర్దములలో వాడబడినవి: --

" న్యాయస్థానము "

"న్యాయస్థానము " అను పదపరిధిలో అందరు న్యాయాధీశులు, మేజిస్ట్రేటులు మరియు, మధ్యవర్తులు తప్ప సొక్ట్యము తీసికొనుటకు శాసన బద్దముగా ప్రాధికారమును పొందిన వ్యక్తులందరును, చేరియుందురు.

"సంగతి ”

"సంగతి * అనగా మరియు ఆ పదపరిథిలో చేరియుండునవి:__

(1) ఇంద్రియములద్వారా గ్రహింప సాధ్యమగునట్టి ఏదేని .విషయము, విషయముల స్థితిగతులు, లేక విషయముల సంబంధము.

(2) ఏ వ్యక్తియైనను గుర్తెరిగియున్నట్టి ఏదేని మానసికస్థితి.