పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(ఎన్‌) ఉపయోగించుటకు అమవుగాని ఒక బండిని 'ఏ'కి 'బీ' అద్దెకు ఇచ్చి తద్చాారా 'ఏ' కి హాని కలిగించినట్టి నిర్లక్షమునకై 'బీ' పై ఏ దావా వేయును.

ఆ బండియందలి ప్రత్యేకమైన లొపము. ఇతర సందర్భములలో 'బీ' దృష్టికి తేబడినదనునది సంబద్దమైన సంగతి ఆగును.

తాను అద్దెకు ఇచ్చు బండ్ల విషయములొ 'బీ' పరిపాటిగా నిర్లక్యము చేయుచుండెను. అనునది సంబద్దమైన సంగతి కాదు.

(ఓ) ఉద్దేశ పూర్వకముగా తుపాకితో కాల్చి చంపివేయుటద్వారా 'బీ' ని హత్య చేసినను 'ఏ' విచారణ చేయబడుచున్నాడు.

'ఏ' ఇతర సందర్భములలో 'బీ' పై తుపాకితో కాల్చి యుండుట. 'బీ'ని కాల్చవలెనను అతని ఉద్దేశమును తెలియజేయినదిగా సంబద్దమైన సంగతి అగును.

జనులను హత్య చేయు ఉద్దేశముతో వారిపై తుపాకి కాల్చుచుండు అలవాటు 'ఏ'కు ఉండుట సంబద్దమైన సంగతి కాదు.

(పీ) ఒక నేరమును గురించి 'ఏ' విచారణ చేయబడుచున్నాడు.

ప్రత్యేకముగా ఆ నేరమును చేయు ఉద్దేశమును సూచించుచు అతడు చెప్పినది సంబద్దమైన సంగతి అగును.

అటువంటి నేరములను చేయు సాధారణ చిత్తవృత్తి ని సూచించుచు ఆతడు చెప్పినది సంబద్దమైన సంగతి కాదు.

కార్యము యాదృచ్చికమా ఉద్దేశ పూర్వకమా అను ప్రశ్నకు సంబంధించిన సంగతులు.

15, ఒక కార్యము యాద్చచ్చికమా. లేక ఉద్దేశ పూర్వకమా లేక ఒక ప్రత్యేకమైన ఎరుకతోగాని ఉద్దేశముతో గాని చేయబడినదా అను ప్రశ్న ఉత్పన్నమై నపుడు, ఆ కార్యమును చేయు వ్యక్తికి ప్రతియొక దానితో సంబంధము గల సాదృశ్య సంఘటనల పరంపరలో అట్టి కార్యము భాగముగా ఉన్నదను సంగతి సంబద్దమైన దగును.

ఉదాహరణములు

(ఏ) భీమా చేసిన తన యింటిని భీమా డబ్బును పాందుటక్షెతగులబెట్టేనను నేరము 'ఏ' పై మోపబడినది

'ఏ' వరుసగా అనేక ఇండ్లలో నివసించెను, అట్టి ప్రతి ఇంటిని అతడు భీమా చేయించెను, అట్టి ప్రతి ఇంటిలో అగ్ని ప్రమాదము సంభవించెను; మరియు అతడు ఒక్కొక్క అగ్ని ప్రమాదము తరువాత భీమా కార్యాలయములో భీమా డబ్బును తీసికొనెను, అను సంగతులు ఆ అగ్ని ప్రమాదములు యాదృచ్చికముగా సంభవించలేదని తెలియజేయు వెఖరి కలవిగా సంబద్దములు అగును,

(బీ) 'బీ' తనయొక్క బుణస్థుల నుండి డబ్బు వసూలు చేయుటకు 'ఏ' ని నియోగించినాడు. వసూలయిన మొత్తములను చూపుచూ పద్దులను ఒక పుస్తకములొ నమోదు చేయుట, 'ఏ' యొక్క కర్తవము, ఒకానొక సందర్భములో నిజముగా తాను వసూలు చేసిన దానికంటే తక్కువ మొత్తమును వసూలు చేసినట్లు ఆతడు నమోదు చేయును.

ఈ తప్పుడు నమోదు యాదృచ్శికమై నదా ఉద్దేశ పూర్శకమైనదా ఆనునది ప్రశ్న.

అదే పుస్తకముతో 'ఏ' చేసిన ఇతర నమోదులు తప్పుడుగా ఉండుటయు అట్టి ప్రతి సందర్భములోను ఆ తప్పుడు నమోదు 'ఏ' కు లాభదాయకముగా ఉండుటయు సంబద్దములైన సంగతులు,

(సీ) ఒక నకిలీ రూపాయను 'బీ' కి కపటముతో ఇచ్చెనని 'ఏ' పై నేరము మోపబడినది.

ఆ రూపాయను ఇచ్చుట యాదృచ్చికమై నదా అనునది ప్రశ్న.

'బీ' కి ఇచ్చుటకుముందే లేక వెనువెంటనే 'ఏ' నకిలీ రూపాయలమ. 'సీ' 'డీ ' లకు 'ఈ ' కి ఇచ్చి యుండుట 'బీ' కి ఇచ్చుట యాదృచ్చికము కాదని తెలియజేయునదిగా సంబద్దమ్మెన సంగతి అగును.

వ్యవహార సరళి యుండుట ఎప్పుడు సంబద్దమగును.

16. ఒకానొక కార్యము చేయబడినదా అను ప్రశ్న ఉత్పన్నమై నపుడు, ఏవ్యవహారసరళి ననుసరించి సభావత: ఆకార్యముచేయబడి యుండెడిటో అట్టి ఏదేని వ్వ్యవహార సరళి ఉండియుండుట సంబద్దమైన సంగతి యగును.