పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అదే రీతిగా వాయబడిన ఇతర వినిమయ పత్రములను, అందలి పేయీ వాస్తవిక వ్యక్తే అయి యుండినచో వాటిని అతడు 'ఏ' కు పంపగలిగి యుండుటకు పూర్వమే 'ఏ' వాటిని స్వీకరించి యుండుట పేయీ కల్పిత వ్యక్తి యని 'ఏ' ఎరిగి యున్నట్టు తెలియజేయునదిగా సంబద్ధమ్హైన సంగతి అగును.

(ఈ) 'బీ' కి అపఖ్యాతి కలిగించు. ఉద్దేశముతో నిందారోపణమును ప్రచురించుటద్వారా 'బీ'కి పరువు నష్టము కలిగించెనని 'ఏ' పై నేరము మోపబడినది.

'బీ' పట్ల 'ఏ' కు గల వ్లైమనస్యమును నిరూపించు ప్రచురణలు 'బీ' ని గురించి 'ఏ' అంతకు పూర్వము చేసియుండుట, ప్రశ్నగతమైన ఆ ప్రత్యేక ప్రచురణద్వారా 'బీ' కి అపఖ్యాతి కలుగజేయుట 'ఏ' యొక్క ఉద్దేశమని రుజువు చేయునదిగా సంబద్దమైన సంగతి అగును.

'ఏ' 'బీ' ల మధ్య అంతకు పూర్వము ఎట్టి కలహము లేకుండుట, ఫిర్యాదుకు. దారితీసిన విషయమును 'ఏ' తాను వినినదానిని వినినట్లే ప్రచురించియుండుట, 'బీ' కి అపఖ్యాతి కలుగజేయు ఉద్దేశము 'ఏ' కు లేనట్లు నిరూపించునవిగా సంబద్దములైన సంగతులు అగును.

(ఎఫ్ ) దివాలాదారైన 'సీ' ఆర్ధిక పరపతి గలవాడని 'ఏ ' కపటముగా 'బీ 'తో చెప్పెననియు అందువలన తాను 'సీ ' ని నమ్మి నష్టమునకు గురి అయితిననియు 'బీ ', 'ఏ' పై దావా వేయును.

'సీ ' ఆర్జిక పరపతి గలవాడని 'ఏ' చెప్పినపుడు 'సీ ' యొక్క ఇరుగు పొరుగు వారును అతనితో న్యవహరించు వ్యక్తులును అతడు ఆర్ధిక పరపతి కలవాడేనని భావించి యుండుట, 'ఏ' చెప్పినది సద్భావముతోనే చెప్పెనని తెలుపునదిగా, సంబద్దమైన సంగతి అగును.

(జీ) 'ఏ' యొక్క ఇంటి విషయమున 'సీ ' అను కాం ట్రాక్టరు యొక్క ఉత్తరువు ప్రకారము 'బీ ' తాను చేసిన పనికి మూల్యము కొరకు 'ఏ' పై దావా చేయును,

'బీ ' తన కాంట్రాక్టును. 'సీ ' తో చేసికొనెననునది 'ఏ' యొక్క ఉత్తరవాదము.

ప్రసక్తిలో నున్న పనిక్షై 'ఏ' డబ్బును 'సీ ' కి ఇచ్చియుండుట, 'ఏ' యొక్క ఏజంటుగా. కాక 'సీ ' తన సొంత బాపతుననే 'బీ ' తో కాంట్రాక్టు చేసికొనుటకు 'సీ ' కి వీలుపడునట్లు ప్రసక్తిలో యున్న పనియొక్క నిర్వహణమును సద్భావముతో 'సీ ' కి 'ఏ' అప్పగించెనని రుజువు చేయునదిగా సంబద్దమై న సంగతి అగును.

(హెచ్‌) తనకు దొరికిన ఆస్తిని నిజాయితీ లేకుండా దుర్వినియోగము చేసెనని 'ఏ' పై నేరము మోపబడినది. ఆ ఆస్తిని ఆతడు వినియోగించుకొనినపుడు దాని నిజమైన సొంతదారు దొరకడని సద్భావ పూర్వకముగా ఆతడు విశ్వసించెనా అనునది ప్రశ్న. |

'ఏ' ఉండుచోట ఆ అస్తి పోవుటను గూర్చి బహిరంగ ప్రకటన జరుగుట, నిజమైన సొంతదారు దొరకడని సద్భావ పూర్వకముగా 'ఏ' విశ్వసింపలేదని తెలియజేయునదిగా సంబద్దమైన సంగతి అగును.

ఆ అస్తి పోయినట్లు తెలిసి దానికై తప్పుడు క్తెయిము పెట్టుటకు 'సీ ' ఆ ప్రకటనను కపటముగా చేసినాడని 'ఏ' ఎరిగియుండుట లేక అట్లు విశ్వసించుటకు అతనికి కారణము ఉండుట, ఆ ప్రకటనను గురించి 'ఏ' ఎరిగి యుండినను. 'ఏ'కు సద్భావము ఉండుటను నిజముకానట్లు రుజువు చేయలేదని తెలుపునదిగా సంబద్దమైన సంగతి అగును.

(ఐ) 'బీ ' ని చంపవలెనను ఉద్దేశముతో అతనిపై తుపాకీ, కాల్చెనని 'ఏ' పై ఆరోపణగలదు. 'ఏ' యొక్క ఉద్దేశమును తెలియజేయుటకై , లోగడ 'బీ' పై 'ఏ' తుపాకీ కాల్చెనని రుజువు చేయవచ్నును.

(జే)'బీ ' కి బెదిరింపు జాబులు పంపినాడని 'ఏ' పై ఆరొపణ గలదు. లొగడ 'ఏ' చే 'బీ' కి పంపబడిన బెదిరింపు జాబులను, ఆ జాబుల ఉద్దేశమును తెలియజేయునవిగా రుజువు చేయవచ్చును. ,

(కే) 'ఏ' తన భార్యయైన 'బీ' పట్ల క్రూరముగా వ్యవహరించెనా అనునది ప్రశ్న.

అటుల చెప్పబడిన క్రూరతకు కొంచెము ముందు లేక తరువాత, ఒండొరులు వెలిబుచ్చుకొనిన వారి భావములో సంబద్దములైన సంగతులు అగును.

(ఎల్‌ ) 'ఏ' యొక్క మరణమునకు , విషప్రయోగము కారణమా అనునది ప్రశ్న.

అస్వస్థుడుగా ఉన్న కాలములో 'ఏ' తన అనారొగ్య లక్షణములను గూర్చి చేసిన కథనములు సంబద్దముల్తెన సంగతులు అగును.

(ఎమ్) 'ఏ' తన జీవితమును భీమా చేసినపుడు అతని అరొగ్య స్థితి ఎట్లుండెను ఆనునది ప్రశ్న.

ప్రసక్తిలో గల సమయమున లేక తత్సమీప కాలమున తన ఆరొగ్య స్థితిని గూర్చి 'ఏ' చేసిన కథనములు సంబద్దములైన సంగతులు ఆగును.