పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదాహరణములు


(ఏ) ఒకానొకజాబు పంపబడినదా అనునది ప్రశ్న.

మామూలు వ్యవహారసరళి ప్రకారము ఒకానొకచోట ఉంచబడు జాబులన్నియు తపాలాకు పంపబడుననునదియు, జాబు ఆ చోటనే ఉంచబడినదనునదియు, సంబద్దములై న సంగతులగును.

(బి) ఒకానొక జాబు 'ఏ' కు చేరినదా అనునది ప్రశ్న. అది మామూలు సరళిలో తపాలా పెట్టెలో వేయబడినదను. నదియు, చిరునామా తెలియరాని జాబుల. కార్యాలయము. ద్యారా వాపసు రాలేదనునదియు, సంబద్దములైన సంగతులగును.

ఒప్పుకోళ్ళు.

ఒప్పుకోలుకు నిర్వచనము,

17. ఒప్పుకోలు అనగా ఏదేని వివాదాంశ సంగతిని లేక సంబద్ద సంగతిని గురించి ఏదేని ఊహను సూచించునదై ఇందు ఇటు పిమ్మట పేర్కొనబడినట్టి వ్యక్తులలో ఎవరిచేనైనను అట్లు పేర్కొనబడినట్టి పరిస్టితులలో చేయబడిన వాగ్రూపమ్మెన లేక దస్తావేజీ రూపమైన కథనము.

చర్యా పక్టకారునిచే లేక అతని ఏజెంటుచే, ఒప్పుకోలు,

18. చర్యాపక్ష కారునిచేగాని అట్టి ఎవరేని పక్ష కారుని నుండి అభివ్యక్తముగ లేక గర్భితముగ అందుకు ప్రాధికారము పొందినట్టు ఆ కేసు పరిస్టితులను బట్టి న్యాయస్థానము తలచునట్టి అతని ఏజెంటుచేగాని, చేయబడిన కథనములు ఒప్పుకోళ్ళు అగును.

ప్రాతివిధిక ప్రతిపత్తి తో దావా కక్షదారునిచే.

ప్రాతినిథిక ప్రతిపత్తినిబట్టి దావాను తాము వేసినట్టి లేక దావా తమపై వేయబడినట్టి దావా పక్షకారులచే చేయబడిన కధనములు వాటిని చేసినప్పుడు ఆ పక్షకారునకు ఆ ప్రాతినిధిక ప్రతిపత్తి, యుండియున్ననే తప్ప, ఒప్పుకోళ్ళు కావు.

విషయ వన్తువునందు హితబద్దుడైన పక్ష కారునిచే.

(1) చర్యా విషయవష్తువులో ఏదేని స్వామిత్వ లేక ధనసంబంధ హితమును కలిగియుండి అట్టు హితబద్ద ప్రతిపత్తిగల వ్యక్తులుగా ఆ కథనము చేయు వ్యక్తులచే, లేకహితముము సంక్రమింప జేసిన వ్యక్తులచే.

(2) దావా పక్షకారులకు ఆ దావా విషయవస్తువు నందు హితమును సంక్రమింపజేసిన వ్యక్తులచే,

చేయబడిన కథనములు, ఆ వ్యకులయొక్క. హితము. కొనసాగుచున్నప్పుడు చేయబడినచో ఒప్పుకోళ్ళు, అగును,

దావా పక్షకారునకు వ్యతిరేకముగా ఏ వ్యక్తుల యొక్క స్థితిని రుజువుపరచవలెనో వారిచే ఒప్పుకోళ్ళు,

19. ఏ వ్యక్తులస్థితిని లేక బాధ్యతను దావాయందలి పక్షకారులలో ఎవరికై నను వ్యతిరేకముగా రుజువుపరచుట ఆవశ్యకమై ఉండునో, అట్టి వక్తులచే చేయబడిన కథనములు, వారిచే వేయబడిన దావాలోగావి, వారిపై తేబడిన దావాలో గాని అట్టి స్థితికి లేక బాధ్యతకు సంబంధించి వారికి వ్యతిరేకముగా సంబద్ద మయ్యెడివగుచో మరియు అవి వాటిని చేయు వ్యక్తులు అట్టి స్థితియందుండగా లేక అట్టి బాధ్యతకు లోనై యుండగా చేయబడినవె నచో, ఒప్పుకోళ్ళు అగును.

ఉదాహరణములు

'బీ' తరపున అద్దెలు వసూలుచేయు. బాధ్యతను 'ఏ' వహించును.

'సీ' నుండి 'బీ'కి రావలసిన అద్దెను వసూలు చేయనందుకు 'ఏ' పై 'బీ' దావావేయును,

'బీ' కి 'సీ' అద్దె బాకీలేడని 'ఏ' అనును. తాను 'బీ' కి అద్దె బాకీ యుండినట్లు 'సీ' చే చేయబడిన కథనము ఒప్పుకోలు అయి 'బీ' కి 'సీ' అద్దె బాకీలేడని 'ఏ' అన్నచో 'ఏ' కు వ్యతిరేకముగా సంబద్దమైన సంగతి అగును.

దావా పక్టకారుడు అభివ్యక్తముగా నిర్దేశించు వ్యక్తులచే ఒప్పుకోళ్ళు.

20. ఒక వివాదగ్రస్త విషయమును గురించిన సమాచారమును తెలియజేయుటకు దావా పక్తకారుడు అభివ్వక్తముగా నిర్దేశించు వ్యక్తులు చేయు కథనములు ఒప్పు కోళ్ళు అగును.

ఉదాహరణములు

'బీ' కి 'ఏ' విక్రయించిన గుర్రము. జబ్బులేనిదేనా అనునది ప్రశ్న.

'బీ' తో 'ఏ' "వెళ్ళి 'సీ' ని అడుగుము, దానిని గురించి 'సీ'కి అంతా తెలియును” అనును 'సీ' యొక్క కథనము ఒప్పుకోలు అగును.